రజనీకి విలన్‌గా గోపిచంద్.. మ్యాచో హీరో ఏమన్నారంటే..!

రజనీకాంత్‌ ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నాత్తే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రజనీ సరసన మీనా, ఖుష్బూ, నయనతార నటిస్తున్నారు.

రజనీకి విలన్‌గా గోపిచంద్.. మ్యాచో హీరో ఏమన్నారంటే..!

Edited By:

Updated on: Apr 21, 2020 | 10:05 AM

రజనీకాంత్‌ ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నాత్తే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రజనీ సరసన మీనా, ఖుష్బూ, నయనతార నటిస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్, కీర్తి సురేష్‌, సూరీ, సతీష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఈ మూవీలో రజనీకి విలన్‌గా గోపిచంద్ నటిస్తున్నారని ఆ మధ్య పుకార్లు తెగ హల్‌చల్ అయ్యాయి. కెరీర్ ప్రారంభంలో ప్రభాస్, మహేష్‌, నితిన్‌లకు విలన్‌గా చేసిన గోపిచంద్.. ఆ తరువాత హీరోగా బిజీ అయ్యారు. ఇక ఇప్పుడు రజనీ కోసం ఆయన మరోసారి విలన్‌గా మారినట్లు వార్తలు వచ్చాయి.

ఇక తాజాగా ఆ వార్తలపై గోపిచంద్ స్పందించారు. అవన్నీ పుకార్లని ఆయన అన్నారు. రజనీకి విలన్‌గా తాను నటించబోతున్నట్లు వార్తలు రాగానే.. తమిళ స్నేహితులు ఫోన్‌ చేసి అడిగారు. అవన్నీ నిజం కాదని చెప్పా. అన్నాత్తే దర్శకుడు శివ.. తెలుగులో నాతో రెండు సినిమాలను తీశారు. తరచుగా నేను, ఆయన మాట్లాడుకుంటూ ఉంటాం. మీరెప్పుడు చెబితే అప్పుడు సినిమా చేస్తాను సర్ అని శివ అంటుంటాడు. నువ్వు తమిళంలో బాగా చేస్తున్నావు. పెద్ద హీరోలతో చేయడం మంచిది. మనం తరువాత చూసుకుందాం అని శివకు చెప్పానని గోపిచంద్ అన్నారు. కాగా ప్రస్తుతం ఈ నటుడు సిటీమార్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత తేజ దర్శకత్వంలో అలిమేలుమంగ వేంకటరమణ చేయనున్నాను అని గోపిచంద్ వివరించారు.

Read This Story Also: ఆస్కార్ విన్నింగ్ ‘పారాసైట్‌’పై రాజమౌళి షాకింగ్ రివ్యూ.. నెట్టింట చర్చ.. !