ఆస్కార్ విన్నింగ్ ‘పారాసైట్‌’పై రాజమౌళి షాకింగ్ రివ్యూ.. నెట్టింట చర్చ.. !

2019 సంవత్సరానికి గానూ ఉత్తమ చిత్రంగా కొరియన్ మూవీ పారాసైట్ ఆసార్క్‌ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఆస్కార్ విన్నింగ్ 'పారాసైట్‌'పై రాజమౌళి షాకింగ్ రివ్యూ.. నెట్టింట చర్చ.. !
Follow us

| Edited By:

Updated on: Apr 21, 2020 | 9:46 AM

2019 సంవత్సరానికి గానూ ఉత్తమ చిత్రంగా కొరియన్ మూవీ పారాసైట్ ఆసార్క్‌ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై దర్శకధీరుడు రాజమౌళి షాకింగ్ కామెంట్లు చేశారు. ఓ టీవీ షోకు ఇచ్చిన ఇంటర్వ్యూ పారాసైట్ మూవీపై జక్కన్న స్పందించారు. ఆ సినిమా తనకు చాలా బోర్‌గా అనిపించిందని కామెంట్లు చేశారు. దీంతో ఇప్పుడు ఈ కామెంట్లు హాట్‌ టాపిక్‌ అయ్యాయి.

కాగా దక్షిణ కొరియాలో పేద, ధనవంతుల జీవనం మధ్య వ్యత్యాసాన్ని తెలుపుతూ బాన్‌ జూన్‌ హో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రతిష్టాత్మక కేన్స్‌ ఫెస్టివల్స్‌లో అవార్డును సాధించిన పారాసైట్.. ఉత్తమ విదేశీ చిత్రం, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే కేటగిరీల్లో.. నాలుగు ఆస్కార్‌లను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పలువురు క్రిటిక్స్‌ ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు. అలాంటి ఈ మూవీపై ఇప్పుడు రాజమౌళి ఇలాంటి రివ్యూ ఇవ్వడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. కాగా ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ  ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫాం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమ్‌ అవుతోంది.

Read This Story Also: కరోనా అప్‌డేట్స్‌.. ఏఏ దేశాల్లో ఎక్కువగా ఉందంటే..!