Gopichand Malineni NBK Film : బాలయ్య, బోయపాటి కాంబోను మించి ఫైట్స్ డిజైన్ చేస్తోన్న గోపీచంద్.. ఫ్యాన్స్ కు పూనకాలేనా..!

|

Feb 17, 2021 | 1:45 PM

కరోనా సమయంలో కూడా సినిమా రిలీజ్ చేసి క్రాక్ సినిమాతో రీసెంట్గా హిట్టు కొట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని. తాజాగా బాలకృష్ణతో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. బాలయ్య ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని స్టోరీని మాల్ మసాలాలు వేసి...

Gopichand Malineni NBK Film : బాలయ్య, బోయపాటి కాంబోను మించి ఫైట్స్ డిజైన్ చేస్తోన్న గోపీచంద్.. ఫ్యాన్స్ కు పూనకాలేనా..!
Follow us on

Gopichand Malineni NBK Film : కరోనా సమయంలో కూడా సినిమా రిలీజ్ చేసి క్రాక్ సినిమాతో రీసెంట్గా హిట్టు కొట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని. తాజాగా బాలకృష్ణతో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. బాలయ్య ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని స్టోరీని మాల్ మసాలాలు వేసి మరీ. తీర్చిదిద్దుతున్నాడనే టాక్ వినిపిస్తోంది. కరోనా తరువాత ఇటు రవితేజకు, అటు టాలీవుడ్‌కు మంచి కమ్ బ్యాక్‌ నిచ్చిన మలినేని.. ఇప్పుడు బాలయ్యకు కూడా అదే రేంజ్‌ బ్యాకప్‌ సినిమాను ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది.

అయితే ఈ క్రేజీ కాంబినేషన్‌ను మహా క్రేజీ గా నిలపడానికి గోపీచంద్‌ మలినేని బాలకృష్ణను ఓ ట్రెండీ లుక్‌లోకి మార్చబోతున్నాడట. హుందాగా.. కనబడేలా.. అభిమానులను ఆకట్టుకునేలా ఈ సినిమా కోసం ఓ గెటప్‌ను సెట్‌ చేపిస్తున్నాడట. ఒక్క గెటప్‌ మాత్రమే కాదు.. ఇక సినిమాల్లో బాలయ్య చేసే ఫైట్లు కూడా.. దద్దరిల్లి పోయాలా చేప్పిచేందుకు ప్లాన్‌ చేస్తున్నాడట. క్రాక్ సినిమాలోని వేటపాలం గూండాలతో రవితేజ చేసిన ఫైట్లలాగే.. ఈ సినిమాలో కూడా ఊరమాసు నాటు ఫైట్లును చేయాలని యాక్షన్‌ డైరెక్టర్లు రామ్‌ లక్ష్మన్లకు పురమాయించాడనే టాక్ ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తోంది. అంతేకాదు ఈ కాంబోలో సినిమా బాలయ్య, బోయపాటి కాంబోను మించిపోతుందని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే సందడి చేస్తున్నారు.

Also Read:

ప్రేమ, పెళ్లి , ఫ్యామిలీ, అభిరుచులను నెటిజన్లతో పంచుకున్న హీరో వెంకటేష్ కూతురు ఆశ్రిత

 ఏపీలో కొనసాగుతోన్న పంచాయతీ ఎన్నికలు.. వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారంటూ టీడీపీ నేతల ఆందోళన