AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madhuri Rathod: మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయి మోసం చేశాడంటూ..

ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలం రేపింది. ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసినా అరెస్ట్ చేయకపోవడంతో మనస్తాపానికి గురైన మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ క్రమంలోనే.. డోర్ పగలగొట్టి ఫ్యాన్‌కు వేలాడుతున్న మాధురి రాథోడ్‌ను కుటుంబ సభ్యులు కాపాడారు.

Madhuri Rathod: మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయి మోసం చేశాడంటూ..
Madhuri Rathod
Shaik Madar Saheb
|

Updated on: Sep 06, 2026 | 3:11 PM

Share

ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలం రేపింది. ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసినా అరెస్ట్ చేయకపోవడంతో మనస్తాపానికి గురైన మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ క్రమంలోనే.. డోర్ పగలగొట్టి ఫ్యాన్‌కు వేలాడుతున్న మాధురి రాథోడ్‌ను కుటుంబ సభ్యులు కాపాడారు. పెళ్లి చేసుకుంటానని ఈశ్వర్ సాయి మోసం చేయడంతో తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లు కుటుంబసభ్యలు పేర్కొంటున్నారు. నార్సింగి పోలీసులు డాన్సర్‌ ఈశ్వర్ సాయిని తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ మాధురి రాథోడ్ ఆరోపిస్తున్నారు.

ఫోక్ సాంగ్ డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వివాదం గత కొంతకాలం నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే.. వీరిద్దరూ రూమ్ లో ఉండగా.. ఈశ్వర్ సాయి భార్య పట్టుకున్న విషయం తెలిసిందే.. ఆ తర్వాత వీరికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ వివాదంపై ఈశ్వర్ సాయి తన తప్పు లేదని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేయగా.. ఈశ్వర్ తనను పెళ్లిపేరుతో మోసం చేశాడని మాధురి రాథోడ్ ఫిర్యాదు చేసింది.

ఈ క్రమంలోనే.. డ్యాన్సర్ మాధురి రాథోడ్ తనకు న్యాయం జరగడంలేదంటూ.. ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం.. తన ఇంట్లో.. ఫ్యాన్ కు ఉరి వేసుకోగా.. డోర్ పగలగొట్టి మాధురిని కుటుంబ సభ్యులు కాపాడారు. ఈశ్వర్ సాయిపై పోలీసులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడంలేదని.. అందుకే.. ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా మాధురి ఆరోపించడం సంచలనంగా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us