‘Enemy’ Movie : తమిళ హీరోలు ఆర్య -విశాల్ కలిసి మరోసారి నటించబోతున్న విషయం తెలిసిందే. ‘ఎనిమి’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో ఆర్య నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. నోటా చిత్ర దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం విశాల్‌కు 30వ చిత్రం కాగా, ఆర్యకు 32వ చిత్రం.
తాజాగా ఈ సినిమా నుంచి ఆర్య లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్ లు సినిమా పై ఆసక్తిని పెంచాయి. తాజాగా విడుదలైన పోస్టర్ లో ఆర్య ఒక్కడే కనిపిస్తున్నాడు. చేతులకు మొఖానికి గాయాలతో కోపంగా చూస్తున్న ఆర్య లుక్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ సినిమా పై క్యూరియాసిటీని మంరింత పెంచేసింది. ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో నటించిన మృణాళిని హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో ఈ ఇద్దరు హీరోలు కలిసి ‘వాడు వీడు’ అనే సినిమా చేశారు. బాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆర్య, విశాల్ పల్లెటూరి మొరటోళ్లుగా కనిపించి తమ నటనతో ఆకట్టుకున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :