AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

”మీకు గర్ల్‌‌‌‌‌‌‌‌ఫ్రెండ్స్ లేరా..వాళ్ళకి నడుముల్లేవా”.. ఆకట్టుకుంటున్న ‘ఎస్ఆర్ కల్యాణమండపం’ టీజర్..

కంటెంట్ ఉంటే చాలు సినిమాను ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా..

''మీకు గర్ల్‌‌‌‌‌‌‌‌ఫ్రెండ్స్ లేరా..వాళ్ళకి నడుముల్లేవా''.. ఆకట్టుకుంటున్న 'ఎస్ఆర్ కల్యాణమండపం' టీజర్..
Rajeev Rayala
| Edited By: |

Updated on: Feb 04, 2021 | 2:56 PM

Share

SR Kalyanamandapam : కంటెంట్ ఉంటే చాలు సినిమాను ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా.. ఇప్పటికే టాలీవుడ్ లో కథను నమ్ముకున్న చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి. కొత్త కొత్త ఆలోచనలతో అందమైన ప్రేమ కథలతో, యాక్షన్ థ్రిల్లర్ లతో నూతన దర్శకులు తమ టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. ఈ తరహాలోనే త్వరలో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే ఎస్ ఆర్ కల్యాణమండపం.

శ్రీధర్ గాదే దర్శకత్వంలో ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ కిరణ్ అబ్బవరం – ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంకా జవాల్కర్ జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి రెండు పాటలను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ రెండు పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమానుంచి టీజర్ ను విడుదల చేశారు. ” ఏ అన్నో మీకు గర్ల్ ఫ్రెండ్ లేరా..? లేక వాళ్లకు నడుములు లేవా ..? ప్రతి ఒక్కడికి నా గర్ల్ ఫ్రెండ్ నడుముతోనేనా పంచాయితీ అంటూ హీరో చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. ఈ సినిమాలో సీనియర్ హీరో సాయికుమార్ హీరో తండ్రిగా నటించారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది. తనికెళ్ల భరణి – తులసి – శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాను సమ్మర్ కానుకగా విడుదల చేయాలని చిత్రనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి..