OTT vs Multiplex‌: చిత్ర పరిశ్రమలో సరికొత్త వివాదం.. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, మల్టీఫ్లెక్స్‌ల మధ్య మరో సమస్య..

|

Jan 01, 2021 | 1:06 PM

OTT vs Multiplex‌: లాక్‌డౌన్ కాలంలో ప్రేక్షకులను అలరించిన ఓటీటీ ప్లాట్ ఫామ్స్, లాక్‌డౌన్ అనంతరం తెరుచుకున్న మల్టీఫ్లెక్స్‌ల

OTT vs Multiplex‌: చిత్ర పరిశ్రమలో సరికొత్త వివాదం.. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, మల్టీఫ్లెక్స్‌ల మధ్య మరో సమస్య..
Follow us on

OTT vs Multiplex‌: లాక్‌డౌన్ కాలంలో ప్రేక్షకులను అలరించిన ఓటీటీ ప్లాట్ ఫామ్స్, లాక్‌డౌన్ అనంతరం తెరుచుకున్న మల్టీఫ్లెక్స్‌ల మధ్య తాజాగ వివాదం నడుస్తోంది. ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలను మళ్లీ థియేటర్లలో ప్రదర్శించడాన్ని మల్లీఫ్లెక్స్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైన తెలుగు మూవీ వి.. శుక్రవారం థియేట‌ర్లో మ‌ళ్లీ రిలీజైంది. అలాగే పే ప‌ర్ వ్యూ స‌ర్వీస్ అయిన జీ ప్లెక్స్‌లో రిలీజైన ఖాళీ పీలీ మూవీ కూడా ఇప్పుడు మ‌ళ్లీ థియేట‌ర్లలోకి వ‌స్తోంది. అయితే ఒక సినిమా థియేట‌ర్లలో రిలీజ్ కావాలంటే సెన్సార్ స‌ర్టిఫికెట్ తప్పనిసరి. కానీ ఓటీటీల‌కు ఇది అవ‌స‌రం లేదు. ఈ నేప‌థ్యంలో ఓటీటీల్లో వచ్చిన అన్ని సినిమాల‌ను థియేట‌ర్లో రిలీజ్ చేయ‌డం కూడా సాధ్యం కాదు. అందుకే ఓటీటీ మూవీల‌ను రిలీజ్ చేయ‌డానికి మ‌ల్టీప్లెక్స్‌లు అంగీక‌రించ‌డం లేదు. సినిమాలు నేరుగా ఓటీటీల‌కు వెళ్లే ట్రెండ్ ఏమాత్రం స‌రైన‌ది కాదని పీవీఆర్ లిమిటెడ్ చైర్మన్ అజ‌య్ బిజ్లీ అంటున్నారు. ఇప్పటికే సినిమాల ఆదాయంలో 60 శాతం థియేట‌ర్ల నుంచే వ‌స్తున్నాయని, ఆర్థికంగా చూసుకున్నా థియేటర్‌లో రిలీజే స‌రైన‌ద‌ని ఆయన మనసులోని మాటను తెలిపారు.