మోదీ బయోపిక్‌కి మళ్లీ బ్రేక్..!

ప్రధాని మోదీ బయోపిక్‌కు మళ్లీ బ్రేక్ పడింది. బయోపిక్ విడుదల చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ మోదీగా నటించిన ఈ చిత్రం రిలీజ్‌కి వాయిదాలు పడుతూ వచ్చింది. ఎన్నికల నేపథ్యంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడం వల్ల ఓట్లరపై ప్రభావం చూపుతుందంటూ ప్రతిపక్షాలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. అయితే.. చిత్రం మేకర్స్ మాత్రం మూవీ విడుదలకు అనుమతించాల్సిందిగా అభ్యర్థించారు. కానీ.. సీఈసీ నిర్ణయంతో […]

మోదీ బయోపిక్‌కి మళ్లీ బ్రేక్..!

Edited By:

Updated on: Apr 26, 2019 | 2:48 PM

ప్రధాని మోదీ బయోపిక్‌కు మళ్లీ బ్రేక్ పడింది. బయోపిక్ విడుదల చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ మోదీగా నటించిన ఈ చిత్రం రిలీజ్‌కి వాయిదాలు పడుతూ వచ్చింది. ఎన్నికల నేపథ్యంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడం వల్ల ఓట్లరపై ప్రభావం చూపుతుందంటూ ప్రతిపక్షాలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. అయితే.. చిత్రం మేకర్స్ మాత్రం మూవీ విడుదలకు అనుమతించాల్సిందిగా అభ్యర్థించారు. కానీ.. సీఈసీ నిర్ణయంతో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీంతో.. మళ్లీ కథ మొదటికొచ్చింది.