శబ్ద, వాయు కాలుష్యానికి నా వంతు సహకారం అందించా.. వర్మ దీపావళి సెలబ్రేషన్స్‌

| Edited By:

Nov 15, 2020 | 11:23 AM

సంచలనాలకు మారుపేరైన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏదైనా కాస్త వెరైటీగా చేయడం అలవాటన్న విషయం అందరికీ తెలిసిందే.

శబ్ద, వాయు కాలుష్యానికి నా వంతు సహకారం అందించా.. వర్మ దీపావళి సెలబ్రేషన్స్‌
Follow us on

Ram Gopal Varma: సంచలనాలకు మారుపేరైన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏదైనా కాస్త వెరైటీగా చేయడం అలవాటన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతి పనిలోనూ తన ప్రత్యేకతను చూపుతుంటారు వర్మ. ఈ క్రమంలో తన తల్లి, సోదరితో దీపావళి పండుగను జరుపుకున్న వర్మ.. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎప్పటిలాగే వాటికి తనదైన స్టైల్‌లో కామెంట్‌ పెట్టారు. (సంజయ్‌ దత్‌ ఇంట దీపావళి వేడుకలు.. పాల్గొన్న సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌)

ఓ వీడియోకు శబ్ద, విష వాయు కాలుష్యానికి నా వంతు బాధ్యత నిర్వర్తించా అని.. మరో వీడియోకు నేను సాదారణంగా చాలా పిరికోడిని, అందుకే మా అమ్మ వెనుక దాక్కున్నా అని.. మరో వీడియోకు లో కెమెరా యాంగిల్స్‌ని అమ్మాయిల కోసమే కాదు, క్రాకర్స్‌ల కోసం ఉపయోగిస్తానని కామెంట్లు పెట్టారు. ఇక మరో ఫొటోకు బోరింగ్ దీపావళి రోజున వోడ్కా తాగమని మా అమ్మ, అక్కను కన్విన్స్‌ చేస్తున్నా అని పెట్టారు. మొత్తానికి తనదైన శైలిలో దీపావళిని వర్మ ఎంజాయ్ చేసినట్లు ఆ ఫొటోలు, వీడియోలను చూస్తే అర్థమవుతోంది. (తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా కన్నుమూత.. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ..!)