Ranabaali : రణబాలి సినిమాను అందుకే చూడాలి.. విజయ్ దేవరకొండపై సందీప్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన లేటేస్ట్ మూవీ రణబాలి. అక్టోబర్ 16న పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూ వస్తుంది. ముఖ్యంగా విజయ్ యాక్టింగ్ పై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పై తన స్టైల్లో రివ్యూ ఇచ్చారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. రణబాలి సినిమాను ఎందుకు చూడాలి అనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Ranabaali : రణబాలి సినిమాను అందుకే చూడాలి.. విజయ్ దేవరకొండపై సందీప్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Sandeep Reddy Vanga

Updated on: Oct 18, 2026 | 11:01 AM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. తాజాగా ఈ హీరో నటించిన లేటేస్ట్ మూవీ రణబాలి. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించింది. టీ సిరీస్ సమర్పణలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న పాన్ ఇండియా లెవల్లో విడుదల చేశారు. మొదటి నుంచి మంచి హైప్ నెలకొన్న ఈ చిత్రం థియేటర్లలోకి రాగానే పాజిటివ్ మౌత్ టాక్ సొంతం చేసుకుంది. గీతా గోవిందం, డియర్ కామ్రెడ్ వంటి హిట్స్ తర్వాత రష్మిక, విజయ్ జోడి మరోసారి వెండితెరపై అడియన్స్ హృదయాలు దోచుకుంది. అలాగే ఈ సినిమాలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసింది. ఈ చిత్రంలో విజయ్ యాక్షన్, డెడికేషన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే తాజాగా రణబాలి చిత్రంపై డైరెక్టర్ సందీప్ రెడ్డి రివ్యూ ఇచ్చారు.

” విజయ్.. నీ యాక్షన్ సన్నివేశాల్లో ఒక సహజమైన, అదుపులేని ఉగ్రత కనిపిస్తుంది. దీన్ని కృత్రిమంగా సృష్టించడం సాధ్యం కాదు. నువ్వు పోరాడే తీరులో ఒక భయంకరమైన తీవ్రత ఉంది. భారతీయ చలనచిత్ర రంగంలో తదుపరి ‘ఐకానిక్ యాక్షన్ హీరో’. ఖచ్చితంగా నువ్వే అవుతావని నేను బలంగా నమ్ముతున్నాను. విజయ్ అభినందనలు. నువ్వు నిజంగా ఒక సింహంలాంటి వీరుడివి!” అంటూ ట్వీట్ చేశారు. జయమ్మ పాత్రలో రష్మిక ఆకట్టుకుంది. ఆమె పాత్ర ఎంతో రియాలిస్టిక్ ఫీలింగ్ కలిగించింది. అలాగే అజయ్, అతుల్ మ్యూజిక్ మరో హైలెట్. పాఠ్యపుస్తకాల్లో చెప్పని చారిత్రక అధ్యాయన్ని రణబాలి చూపించింది అని అన్నారు. ఇక సందీప్ పోస్టుకు విజయ్ రిప్లై ఇఛ్చారు. “వంగా.. నువ్వు సినిమా చూశావు. నీ రివ్యూను చెప్పాను. మన కాంబినేషన్ లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ప్రీమియర్స్ తర్వాత మన హగ్, నీ వాయిస్ నాకు ఇంకా గుర్తుంది. పదేళ్ల తర్వాత ఇప్పుడు అదే ఫీలింగ్ కలిగింది. రణబాలి సినిమా నీకు నచ్చుతుందని తెలుసు” అంటూ విజయ్ రిప్లై ఇచ్చాడు.

“మిత్రులారా… దేవరకొండ విజయ్ సాయి అద్భుతమైన పాత్ర యాక్షన్ కోసం ‘రాణబాలి’ సినిమా చూడండి. విజయ్, రష్మిక మధ్య కెమిస్ట్రీకి మించినది. కొన్ని బంధాలు తెరను దాటిపోతాయి. రష్మిక పోషించిన జయమ్మ పాత్ర ఎంతో సహజంగా, హృదయాన్ని కదిలించేలా అనిపించింది.” అంటూ రాసుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..

సందీప్ రెడ్డి వంగా పోస్ట్..

విజయ్ దేవరకొండ ట్వీట్..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : ఇదేం సినిమా రా నాయనా.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చి దుమ్ములేపుతున్న మూవీ.. ట్రెండింగ్ నంబర్ 1గా రచ్చ రచ్చ..

Loading...
Unable to load recommendations.
Follow Us