మంచు విష్ణు పెట్టిన టార్చర్.. ‘ఓటర్’ దర్శకుడి ఆవేదన

|

May 03, 2019 | 7:20 AM

సినీ హీరో మంచు మనోజ్ వివాదంలో ఇరుక్కున్నారు. తనను వేధిస్తున్నారంటూ ఓటర్ మూవీ దర్శకుడు కార్తీక్ రెడ్డి ఆయనపై ఆరోపణలు చేయడం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది.  కార్తీక్ రెడ్డి, సుశాంత్ హీరోగా నటించిన ‘అడ్డా’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. తాజాగా మంచు విష్ణుతో ‘ఓటర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్సును అందుకుంది. త్వరలో సినిమా రిలీజ్‌కి ప్లాన్ చేస్తుండగా, ఇంతలో డైరెక్టర్, విష్ణుపై సంచలన ఆరోపణలు […]

మంచు విష్ణు పెట్టిన టార్చర్.. ఓటర్ దర్శకుడి ఆవేదన
Follow us on

సినీ హీరో మంచు మనోజ్ వివాదంలో ఇరుక్కున్నారు. తనను వేధిస్తున్నారంటూ ఓటర్ మూవీ దర్శకుడు కార్తీక్ రెడ్డి ఆయనపై ఆరోపణలు చేయడం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది.  కార్తీక్ రెడ్డి, సుశాంత్ హీరోగా నటించిన ‘అడ్డా’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. తాజాగా మంచు విష్ణుతో ‘ఓటర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్సును అందుకుంది. త్వరలో సినిమా రిలీజ్‌కి ప్లాన్ చేస్తుండగా, ఇంతలో డైరెక్టర్, విష్ణుపై సంచలన ఆరోపణలు చేసాడు.  తప్పుడు అగ్రిమెంట్‌తో తనను మానసికంగా వేధిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తెలుగు సినీ దర్శకుల సంఘంలో కార్తీక్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందంటే..  హీరో మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ చిత్రానికి, తాను రాసుకొన్న ఓటర్ సినిమా కథకు ఎలాంటి సంబంధం లేకపోయినా… అసెంబ్లీ రౌడీని ఓటర్ పేరుతో అడాప్ట్ చేయడానికి బలవంతంగా తప్పుడు అగ్రిమెంట్ చేయించుకొన్నారని కార్తీక్ రెడ్డి చెప్తున్నాడు. తనను బెదిరించి మంచు విష్ణు, విజయ్ కుమార్ రెడ్డి అగ్రిమెంట్ పేపర్లపై తనతో సంతకాలు చేయించుకొన్నారు అని ఆయన ఆరోపించారు.

మొదట తను ‘పవర్ ఫుల్’ అనే కథ రాసుకుని, రైటర్ అసోషియేషన్‌లో రిజిస్టర్ చేయించాక, విష్టుకి కథ చెప్తే, నచ్చి సినిమా చెయ్యడానికి ముందుకొచ్చాడు.. తర్వాత సినిమా టైటిల్‌ని ఓటర్‌గా మార్చాల్సి వచ్చింది. షూటింగ్ టైమ్‌లో రెండు సీన్లు మార్చమని విష్ణు ఒత్తిడి చేసాడు.. సినిమా నిర్మాణంలో ఫ్రీడమ్ ఇవ్వకుండా, ప్రతీ పనిలో ఇన్ వాల్వ్ అయ్యేవాడు, దీంతో బడ్జెట్ పెరిగిపోయింది. సినిమా పూర్తయ్యాక సినిమా చూసి, సినిమా బాగా రావడంతో కథ, స్క్రీన్‌ప్లే క్రెడిట్స్ తనకివ్వాలని అడిగాడు, నేను ఒప్పుకోలేదు. బెదిరించాడు.. ఆ బాధ భరించలేకే స్క్రీన్‌ప్లే రైటర్‌గా అతని పేరు వేసాను. సినిమా పూర్తి చెయ్యడానికి చాలా మానసిక క్షోభ అనుభవించాను. ఇన్ని ఇబ్బందుల మధ్య సినిమాని రిలీజ్ చెయ్యాలని చూస్తున్నారు.. నాకు న్యాయం జరగాలి.. అంటూ తన మీడియాతో తన బాధను చెప్పుకున్నాడు కార్తీక్ రెడ్డి.