మళ్లీ తమన్నాకు అవమానం.. జక్కన్న ఎందుకిలా..!

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచమంతా చాటిచెప్పిన బాహుబలికి ఇటీవల మరో అరుదైన గౌరవం లభించింది. లండన్‌లోని ప్రతిష్టాత్మక రాయల్ అల్బర్ట్ హాల్‌లో బాహుబలిని ఇటీవల ప్రదర్శించారు. అంతేకాదు 148సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ హాల్‌లో ప్రదర్శించబడ్డ మొదటి నాన్ ఇంగ్లీష్ సినిమా ఇదే కావడం విశేషం. అంతేకాదు ఈ ప్రదర్శనలో కీరవాణి లైవ్ ఆర్కెస్ట్రాను కూడా నిర్వహించారు. ఇక ఈ ప్రదర్శన సందర్భంగా బాహుబలి టీమ్‌ కూడా థియేటర్లో సందడి చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు […]

మళ్లీ తమన్నాకు అవమానం.. జక్కన్న ఎందుకిలా..!

Edited By:

Updated on: Oct 23, 2019 | 10:42 AM

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచమంతా చాటిచెప్పిన బాహుబలికి ఇటీవల మరో అరుదైన గౌరవం లభించింది. లండన్‌లోని ప్రతిష్టాత్మక రాయల్ అల్బర్ట్ హాల్‌లో బాహుబలిని ఇటీవల ప్రదర్శించారు. అంతేకాదు 148సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ హాల్‌లో ప్రదర్శించబడ్డ మొదటి నాన్ ఇంగ్లీష్ సినిమా ఇదే కావడం విశేషం. అంతేకాదు ఈ ప్రదర్శనలో కీరవాణి లైవ్ ఆర్కెస్ట్రాను కూడా నిర్వహించారు. ఇక ఈ ప్రదర్శన సందర్భంగా బాహుబలి టీమ్‌ కూడా థియేటర్లో సందడి చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, నిర్మాత శోభు యార్లగడ్డ, సంగీత దర్శకుడు కీరవాణి.. వేదికపైకి రాగానే ప్రేక్షకులంతా నిలబడి గౌరవించారు. అయితే ఈ టీమ్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా లేకపోవడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు.

నిజానికి చెప్పాలంటే బాహుబలి మొదటి భాగమే అల్బర్ట్ హాల్‌లో ప్రదర్శితమైంది. ఆ పార్ట్‌లో అనుష్క కంటే తమన్నా భాగమే ఎక్కువగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అనుష్క రెండు, మూడు సీన్లకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఈ క్రమంలోనే బాహుబలి 1 విడుదల సమయంలో జరిగిన ప్రమోషన్లలో కూడా తమన్నానే ఎక్కువ ఎలివేట్ చేశాడు దర్శకుడు రాజమౌళి. అప్పుడు ప్రతి ప్రమోషన్‌లోనూ తమన్నానే కనిపించింది. అయితే ఇప్పుడు మాత్రం బాహుబలి టీమ్ వెంట తమన్నా లేకపోవడం గమనర్హం.

నిజానికి చెప్పాలంటే బాహుబలి రెండు భాగాల్లోనూ తమన్నాకు పెద్దగా పేరు వచ్చింది ఏం లేదు. మొదటి భాగంలో ఎక్కువ కనిపించినప్పటికీ.. ఆ పాత్రకు పెద్ద ప్రాధాన్యత ఉండదు. కేవలం గ్లామర్‌ షోకు మాత్రమే ఆమె పరిమితమై ఉంటుంది. ఇక రెండో భాగంలో అయితే కారెక్టర్ ఆర్టిస్ట్‌లా మిగిలిపోయింది తమన్నా. దీంతో తమ హీరోయిన్‌కు రాజమౌళి అన్యాయం చేశాడని అప్పట్లో తమన్నా ఫ్యాన్స్ బాగా ఫీలయ్యారు. ఇక ఇప్పుడు మళ్లీ తమన్నాను పట్టించుకోలేదన్న చర్చ టాలీవుడ్‌లో జరుగుతోంది. అయితే తమన్నాను కూడా తమ వెంట తీసుకువెళ్లాలని రాజమౌళి అనుకున్నాడని.. కానీ షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్ల ఆమెకు కుదరలేదని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఎఫ్ 2, సైరాతో రెండు విజయాలను ఖాతాలో వేసుకున్న తమన్నా.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది.