తమిళ స్టార్ హీరో మారి సెల్వరాజ్ ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కర్ణన్’. వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు విశేషస్పందన లభించింది. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుంది ఈ మూవీ. లుంగీ కట్టుకుని, పెద్ద కత్తిన పట్టుకుని సహజమైన లుక్‌లో దర్శననిచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు ధనుష్. ఇక ఈ సినిమా అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి.. రిలీజ్ డేట్‍ను ప్రకటించింది చిత్రయూనిట్.
తాజాగా విడుదలైన పోస్టర్లో ధనుష్.. రక్తంతో తడిచిన చేతులకు సంకెళ్లు వేసుకొని సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా ప్రకటించారు. ఇదిలా ఉండగా.. తాజాగా విడుదలైన ధనుష్ లుక్ చూస్తుంటే సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కలైపులిథాను నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఒక ఊరినే నిర్మించేశారు. సంతోష్ నారాయణ్ బాణీలను అందిస్తున్నారు.
#Karnan in theaters worldwide from 9.4.2021 (April 9th) ?? Here is the #KarnanFirstLook poster! See you all in Theaters ??@KarnanTheMovie@dhanushkraja @mari_selvaraj @Music_Santhosh @RIAZtheboss pic.twitter.com/IEI7uzaFbj
— Kalaippuli S Thanu (@theVcreations) February 14, 2021
Also Read:
రూటు మార్చిన డైరెక్టర్ శంకర్.. రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమాకు ఆ మ్యూజిక్ డైరెక్టర్‌కు ఛాన్స్ ?