Film Chamber Elections: ఫిల్మ్‌ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నిక

Teluagu Film Chamber elections: తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్ కామర్స్‌ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. ఫిల్మ్‌ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నికయ్యారు. ఇక వైస్‌ ప్రసిడెంట్‌గా సూర్యదేవర నాగవంశీ ఎన్నిక కాగా.. ఫిల్మ్‌ చాంబర్ కార్యదర్శిగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. అయితే నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సురేష్ బాబు ఏడాది పాటు పదవిలో కొనసాగనున్నారు.

Film Chamber Elections: ఫిల్మ్‌ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నిక
Film Chamber Elections

Updated on: Dec 28, 2025 | 8:00 PM

ఇక.. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికల్లో మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్స్‌ పోటీ పడ్డాయి. మన ప్యానెల్‌ను చిన్ని నిర్మాతలైన సి.కల్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్నకుమార్ బలపరచగా. ప్రోగ్రెసివ్ ప్యానెల్‌ను సురేష్‌బాబు, అల్లు అరవింద్‌, దిల్‌రాజు లాంటి అగ్ర నిర్మాతలు బలపరిచారు. ఇక ఎన్నికల్లో ప్రోగ్రెసివ్‌ ప్యానెల్‌ తన బలాన్ని నిరూపించుకుంది. మొత్తం నాలుగు సెక్టార్లకు సంబంధించిన మొత్తం 48 మంది ఎన్నికయ్యారు. వీరిలో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 31 మంది విజయం సాధించగా, మన ప్యానెల్‌ నుంచి 17 మంది గెలుపొందారు.

అయితే తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికల్లో నాలుగు సెక్టార్ల నుంచి 43 శాతం పోలింగ్ మాత్రమే నమోదు అయింది. ప్రొడ్యూసర్‌ సెక్టార్‌-805, స్టూడియో స్టెకార్‌-66, డిస్ట్రిబ్యూటర్స్ సెక్టార్‌-374, ఎగ్జిబిటర్స్‌ సెక్టార్‌-172 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 3వేల 287 ఓట్లకు 1,417 మాత్రమే పోలవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.