సుశాంత్ కేసు: షోవిక్‌ జ్యుడిషియల్‌ కస్టడీ పొడిగింపు

బాలీవుడ్ నటుడు సుశాంత్‌ కేసులో డ్రగ్స్ కోణంలో అరెస్టైన నటి రియా సోదరుడు షోవిక్‌కి మరోసారి షాక్ తగిలింది. అతడి కస్టడీని

సుశాంత్ కేసు: షోవిక్‌ జ్యుడిషియల్‌ కస్టడీ పొడిగింపు

Edited By:

Updated on: Oct 21, 2020 | 3:49 PM

Sushant Case Showik: బాలీవుడ్ నటుడు సుశాంత్‌ కేసులో డ్రగ్స్ కోణంలో అరెస్టైన నటి రియా సోదరుడు షోవిక్‌కి మరోసారి షాక్ తగిలింది. అతడి కస్టడీని ఎన్సీబీ ప్రత్యేక కోర్టు నవంబర్ 3 వరకు పెంచింది. అయితే ఈ కేసులో సెప్టెంబర్‌ 4న షోవిక్‌ని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత అదే నెల 9వరకు ఎన్సీబీ అధికారులు అతడిని కస్టడీలోకి తీసుకోగా.. తరువాత నుంచి జ్యుడిషియల్ కస్టడీలో ఉంటున్నారు. మరోవైపు ఈ కేసులో అరెస్టైన రియాకు బెయిల్‌ రావడంతో బయటకు వచ్చింది.

కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ జూన్ 14న ముంబయిలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించారు. పోస్ట్‌మార్టంలో సుశాంత్‌ది ఆత్మహత్యగా తేలినప్పటికీ.. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఇది హత్య అని ఆరోపణలు చేశారు. మరోవైపు తన కుమారుడి అకౌంట్‌ నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశారంటూ రియా, ఆమె కుటుంబ సభ్యులు సహా పలువురిపై సుశాంత్‌ తండ్రి ఈడీ కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసులో బీహార్ ప్రభుత్వ కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అనుమతిని ఇచ్చింది. ఇక డ్రగ్స్ కోణం కూడా బయటపడటంతో ఎన్సీబీ రంగంలోకి దిగింది. ఇలా సుశాంత్ కేసును మూడు దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి.

Read More:

Bigg Boss4: మోనాల్, అవినాష్‌ రొమాన్స్‌.. సచ్చిపోండి మీరిద్దరు అన్న అరియానా

రానా ‘అరణ్య’కు విడుదల తేది ఖరారు.. థియేటర్లలో ఎంజాయ్ చేయండన్న టీమ్‌