
టాలీవుడ్‌లో తనదైన కామెడీ టైమింగ్‌తో, ప్రత్యేకమైన మాడ్యులేషన్‌తో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణానికి సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్ట్ హిట్ మూవీ ‘డార్లింగ్’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలు, ఇంటర్వెల్ సీన్‌కు సంబంధించిన తెరవెనుక రహస్యాలను ఆయన బయటపెట్టారు. ఈ ఇంటర్వ్యూలో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ‘డార్లింగ్’ చిత్రంలోని ఇంటర్వెల్ సన్నివేశాల సమయంలో తాను దర్శకుడు , హీరో ప్రభాస్‌తో చర్చించిన కొన్ని విషయాలను గుర్తు చేసుకున్నారు. సినిమాలో ప్రభాస్ విలన్‌కు చెప్పే ఒక కథకు సంబంధించిన సీన్ షూట్ చేస్తున్న సమయంలో, ఒక సందేహం వచ్చి తాను డైరెక్టర్ , హీరోని ప్రశ్నించినట్లు తెలిపారు. “మనం ఇక్కడ ప్రేక్షకులకు ఒక కథ చెప్పి బయటపడుతున్నాము, అంటే ఇది ఆడియన్స్‌ను పిచ్చోళ్లను చేసినట్టే కదా?” అని తాను ప్రశ్నించానని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
ఎక్కువ మంది చదివినవి : ముఠా మేస్త్రీ షూటింగ్ 3 నెలలు ఆగిపోయింది.. అప్పుడు చిరంజీవి చెప్పిన మాటకు ఆశ్చర్యపోయా.. బాబూ మోహన్..
ఆయన చెప్పిన ఈ లాజిక్ విన్న వెంటనే ప్రభాస్ కూడా “అవును కరెక్టే కదా” అని ఒప్పుకున్నారని, ఆ తర్వాత ఆ సన్నివేశంలో కొన్ని మార్పులు చేసి మరింత భావోద్వేగభరితంగా మలిచామని ఆయన తెలిపారు. అమ్మాయిపై ఉన్న నిజమైన ప్రేమని, తనలోని భావాలను ఒక కథ రూపంలో చెప్పినట్లు ఆ సీన్‌ను చాలా అందంగా మార్చామని శ్రీనివాస్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా, సినిమాలోని సన్నివేశాలు మరింత మెరుగ్గా రావడానికి తాను ఎప్పుడూ తన వంతు ఇన్‌పుట్స్ ఇస్తుంటానని ఆయన పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Balakrishna: బాలకృష్ణకు లవర్‌గా, భార్యగా, బామ్మగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..
ఇదే ఇంటర్వ్యూలో తన రెమ్యునరేషన్ విషయాలు, డైరెక్టర్లతో ఉండే బాండింగ్ గురించి కూడా శ్రీనివాస్ రెడ్డి సరదాగా ముచ్చటించారు. సినిమాల్లో పెద్ద హీరోలతో పనిచేస్తున్నప్పుడు కేవలం డబ్బుల గురించే కాకుండా, మంచి కంటెంట్, మంచి పాత్రలు మరియు టీమ్‌తో ఉండే సఖ్యత చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. దర్శకుడు కరుణాకరన్ మరియు ఇతర టెక్నీషియన్లతో తనకు ఉన్న అనుబంధం గురించి చెబుతూ, ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్‌గా నిలదొక్కుకోవడానికి కష్టంతో పాటు సహనం కూడా చాలా అవసరమని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Idupu Kayitham: ఇడుపు కాయితం నుంచి గడప సాంగ్ రిలీజ్.. ప్రతి అమ్మాయి హృదయాలను హత్తుకునే పాట..
ఎక్కువ మంది చదివినవి : Cinema : గరివిడి లక్ష్మి పాత్రను మిస్ చేసుకున్న మరో హీరోయిన్.. నిత్యా మీనన్‌తోపాటు ఆ క్రేజీ బ్యూటీ కూడా..