90’s టాప్ హీరోలుగా కొనసాగినవారందరూ ఇటీవల రీఎంట్రీ స్టార్ట్ చేశారు. ఇప్పటికే రీఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు, చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయారు. అటు యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా తీవ్ర పోటీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారు సీనియర్ హీరోలు. ప్రస్తుతం బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ కూడా తమ తమ సినిమా చిత్రీకరణలలో బిజీగా ఉన్నారు. లాక్ డౌన్ అనంతరం షూటింగ్లు ప్రారంభం కావడంతో వీలైనంత తొందరగా ఈ మూవీ చిత్రీకరణలను పూర్తి చేసి సమ్మర్ బరిలో దిగడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఒకప్పటి టాలీవుడ్ టాప్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, చిరంజీవి కూడా ఈసారి బాక్సాఫీసు వద్ద పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే చిరంజీవి ‘ఆచార్య’, వెంకటేష్ ‘నారప్ప’ సినిమాల విడుదల తేదీలను ప్రకటించారు కూడా.
ప్రస్తుతం బోయపాటి, నందమూరీ బాలకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక బాలకృష్ణ కూడా తన సినిమాను మే నెలలోనే విడుదల చేయనున్నట్లుగా సమాచారం. ఇక బాలయ్య కూడా మే నెలలోనే థియేటర్లలోకి వస్తే.. అభిమానులకు పండగే ఇక. చాలా కాలం తర్వాత సీనియర్ హీరోల సినిమాలు ఒకేసారి బాక్సాఫీసుల వద్ద సందడి చేయనున్నాయి. మరీ అందులో విజేతగా ఎవరు నిలుస్తారనేది చూడాలి మరీ.
Also Read:
actress Hema : అలాంటి పాత్రలు దర్శకులు తనకు ఇవ్వడంలేదని కన్నీళ్లు పెట్టుకున్న నటి హేమ…