మెగాస్టార్ పేరిట స్కూల్స్.. మేనేజ్‌మెంట్ క్లారిటీ

స్కూల్ బిజినెస్‌లో మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇస్తున్నాడన్న వార్తలు ఇటీవల షికార్లు చేశాయి. వీటితో మెగా ఫ్యామిలీ అయోమయంలో పడినట్టుకూడా ప్రచారం జరిగింది. అయితే చిరంజీవి వీరాభిమాని ఒకరు శ్రీకాకుళంలో ఆయన పేరుతో ఇంటర్నేషనల్ స్కూల్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టమైంది. ఈ మేరకు ఈ స్కూల్ సీఈవో శ్రీనివాస్ రావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ స్కూల్స్‌కు, మెగా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. మెగా కుటుంబం మీద ఉన్న అభిమానంతో […]

మెగాస్టార్ పేరిట స్కూల్స్.. మేనేజ్‌మెంట్ క్లారిటీ

Edited By:

Updated on: May 13, 2019 | 4:23 PM

స్కూల్ బిజినెస్‌లో మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇస్తున్నాడన్న వార్తలు ఇటీవల షికార్లు చేశాయి. వీటితో మెగా ఫ్యామిలీ అయోమయంలో పడినట్టుకూడా ప్రచారం జరిగింది. అయితే చిరంజీవి వీరాభిమాని ఒకరు శ్రీకాకుళంలో ఆయన పేరుతో ఇంటర్నేషనల్ స్కూల్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టమైంది. ఈ మేరకు ఈ స్కూల్ సీఈవో శ్రీనివాస్ రావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ స్కూల్స్‌కు, మెగా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. మెగా కుటుంబం మీద ఉన్న అభిమానంతో చిరంజీవి, రామ్ చరణ్, నాగబాబులను గౌరవ ప్రదమైన హోదాల్లో తాము నియమించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Follow Us