
Uppena Movie Pre Release Event: మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమవుతున్నాడు. దీంతో ఈ చిత్రానికి స్టార్ హీరోలతోపాటు మెగా హీరోల మద్దతు లభిస్తోంది. వైష్ణవ్ తేజ్‌కు జోడిగా కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని బుచ్చిబాబు సాన డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఉప్పెన మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఫిబ్రవరి 12న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. తాజాగా ఈరోజు సాయంత్రం జరగనున్న ప్రీరిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు. కాగా ఈరోజు సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. దీనిని టీవీ9లో లైవ్‌లో వీక్షించగలరు.