Bhola Shankar Trailer: చిరు ట్రైలర్‌ ధాటికి షేక్ అవుతున్న దునియా

చెప్పిన టైంకు చెప్పినట్టే.. భోళా శంకర్ నెట్టింట ప్రత్యక్షం అయ్యారు. ముసురు పట్టిన ఈ పరిస్థితుల్లో.. చలితో మజ్జుగా కూర్చున్న ప్రతీ ఒక్కరినీ.. ఎగిరిగంతేలా చేశారు. నవరసాలను పండిస్తూ.. ట్రైలర్ లో కనిపంచి అందరినీ ఖుషీ ఖుషీ అయ్యేలా చేశారు.

Updated on: Jul 28, 2023 | 9:51 AM

చెప్పిన టైంకు చెప్పినట్టే.. భోళా శంకర్ నెట్టింట ప్రత్యక్షం అయ్యారు. ముసురు పట్టిన ఈ పరిస్థితుల్లో.. చలితో మజ్జుగా కూర్చున్న ప్రతీ ఒక్కరినీ.. ఎగిరిగంతేలా చేశారు. నవరసాలను పండిస్తూ.. ట్రైలర్ లో కనిపంచి అందరినీ ఖుషీ ఖుషీ అయ్యేలా చేశారు. అందరి ఒంట్లో వేడిని.. జోరును స్కై హై రేంజ్లో పెంచేశారు.

ఎస్ ! మెహర్ రమేష్‌ డైరెక్షన్లో చిరు చేస్తున్న మోస్ట్ అవేటెడ్ సినిమానే భోళా శంకర్. తమిళ్ హిట్ ఫిల్మ్.. వేదాలం సినిమాకు రిమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేస్తామని.. అది కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా అంటూ.. రెండు రెజుల ముందే అనౌన్స్‌ చేసి అందర్లో వెయింట్‌ పెరిగిపోయేలా చేశారు మేకర్స్. ఇక ఆ వెయింట్‌ను ఫినిష్ చేసేలా.. చెప్పినట్టే.. చెర్రీ చేతుల మీదిగానే భోళా శకంర్ ట్రైలర్ రిలీజ్‌ అయింది. ఎప్పటి లాగే.. చిరును.. ఓ రేంజ్లో పోట్రే చేసింది ఈ ట్రైలర్.

అంతేకాదు చిరుస్ యాక్షన్.. ఎమోషనల్ .. కామెడీ టైమింగ్.. గ్రేస్‌ మూమెంట్‌.. ఇలా అన్నీ.. కొంచెం కొంచెం కొంచెం గా ఈ మూవీ ట్రైలర్‌లో కనిపించడమనేది అందర్నీ ఖుషీ అయ్యేలా చేస్తోంది. సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. దాంతో పాటే.. చిరు లుక్స్‌కు.. కనిపించిన తీరుకు సోషల్ మీడియా దునియా మొత్తం షేక్ం అవుతోంది. లైక్స్‌తో.. వ్యూస్‌తో.. షేరింగ్స్‌తో.. చిరు మేనియా ఎట్ ప్రజెంట్ సోషల్ మీడియాలో పీక్స్లో ఉంది.