తేనెటీగల దాడి.. తృటిలో తప్పించుకున్న చిరు, చెర్రీ..!

మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్‌, ఉపాసనలు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రామ్ చరణ్ సతీమణి ఉపాసన తాత కామినేని ఉమాపతి

తేనెటీగల దాడి.. తృటిలో తప్పించుకున్న చిరు, చెర్రీ..!

Edited By:

Updated on: May 31, 2020 | 2:46 PM

మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్‌, ఉపాసనలు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రామ్ చరణ్ సతీమణి ఉపాసన తాత కామినేని ఉమాపతి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వీరు కామారెడ్డిలోని దోమకొండకు వెళ్లారు. ఉన్నట్లుండి అక్కడ తేనెటీగలు దాడి చేశాయి. అయితే అప్పటికే చిరు కుటుంబం లోపలికి వెళ్లడంతో.. ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇక తేనెటీగల దాడిలో అంత్యక్రియల్లో పాల్గొన్న కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉమాపతి ఈ మంగళవారం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఉమాపతి ఐఏఎస్‌గా సేవలందించారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ దోమకొండలో జరిగాయి.

Read This Story Also: డాక్టర్ సుధాకర్‌కి చికిత్స అందించే‌ వైద్యుడి మార్పు..!