‘OTT’ Platforms: ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌పై కేంద్రప్రభుత్వం సీరియస్.. త్వరలో నూతన మార్గ నిర్దేశకాలు..

|

Feb 06, 2021 | 1:56 PM

'OTT' Platforms: కరోనా పుణ్యమా అని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ బాగా వృద్ధిలోకి వచ్చాయి. లాక్‌డౌన్ సమయంలో ఓ ఊపు ఊపేశాయి. థియేటర్లు లేని సమయంలో ప్రేక్షకులకు

OTT Platforms: ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌పై కేంద్రప్రభుత్వం సీరియస్.. త్వరలో నూతన మార్గ నిర్దేశకాలు..
Follow us on

‘OTT’ Platforms: కరోనా పుణ్యమా అని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ బాగా వృద్ధిలోకి వచ్చాయి. లాక్‌డౌన్ సమయంలో ఓ ఊపు ఊపేశాయి. థియేటర్లు లేని సమయంలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఈ మధ్యలో విడుదలయ్యే సినిమాలు కొన్ని అసభ్యకరంగా ఉంటున్నాయి. సెన్సార్ లేకపోవడంతో ఇష్టారీతిన సినిమాలు రిలీజ్ చేసేస్తున్నారు. దీంతో దీనిపై కేంద్రప్రభుత్వం దృష్టి సారించింది.

ఇండియాలో ప్రస్తుతం 40కి పైగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ ఉండ‌గా వాటిలో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జీ5, ఆల్ట్ బాలాజీ, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సహా ఎన్నో ఓటీటీలు వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకుల‌కు స‌రికొత్త వినోదాన్ని అందిస్తున్నాయి. అయితే ఓటీటీల‌కు సెన్సార్ లేక‌పోవ‌డంతో విచ్చల‌విడి కంటెంటెను ప్రసారం చేసి లాభాలు ఆర్జిస్తున్నారు. దీనిపై 21 మంది పార్లమెంట్ సభ్యులు అభ్యంత‌రం వ్యక్తం చేశారు. రొమాంటిక్ సీన్లు, బూతులు, క్రైమ్ సంబంధిత సన్నివేశాలు చూపించే ఓటీటీపై చర్చలు తీసుకోవాలంటూ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసారు. ఈ నేప‌థ్యంలో బ్రాడ్‌కాస్టింగ్ మినిస్టర్ ప్రకాశ్ జవదేకర్ తాజాగా స్పందించారు. త్వర‌లోనే ఓటీటీల కోసం ప్రత్యేక గైడ్‌లైన్స్‌ను తీసుకు రానున్నామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచ‌ర‌ణ రూపొందుతుంద‌ని పేర్కొన్నారు.

థియేటర్ల యజమానులకు భారీ ఊరటనిచ్చిన ఏపీ ప్రభుత్వం.. 6 నెలల మారటోరియంతో రుణాలు అందించనున్న రాష్ట్ర ప్రభుత్వం