
బాలీవుడ్ బ్యూటీ అలియాభట్, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ పైన కేసు నమోదు అయ్యింది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా పై ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. దాంతో ఈ ఇద్దరికీ కోర్టు షోకాజ్ నోటీసులు జరీ చేసింది. అసలు విషయం ఏంటంటే.. సంజయ్ లీలా బన్సాలీ ‘గంగూబాయ్ కతియావాడి’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ముంబై మాఫియా క్వీన్ ‘గంగూబాయి’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ఈ సినిమా పై గంగూబాయి కుమారుడు బాబూజీ రాజీ షా అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకెక్కారు. హీరోయిన్, దర్శకుడితో పాటు ‘ద మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ పుస్తకాన్ని రాసిన హుస్సేన్ జైదీ పై ఈ సినిమాకు సహకరించిన రిపోర్టర్ జేన్ బోర్గ్స్ పై బాంబే సివిల్ కోర్టులో కేసు దాఖలు చేశారు రాజీ షా. ఈ పుస్తక ప్రచురణలను నిలిపివేయడంతో పాటు దీని ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాను కూడా ఆపేయాలని ఆయన కోరారు. సినిమాలో గుంగూబాయిని అసభ్యంగా చిత్రీకరించినందుకు పరువు నష్టం దావా వేసేందుకు కూడా వెనకాడబోమని బాబూజీ రాజీ షా న్యాయవాది పేర్కొన్నారు. ఈ విషయం పై స్పందించాలని కోర్టు చిత్ర యూనిట్ కు సమన్లు పంపుతూ జనవరి 7 వరకు గడువునిచ్చింది. మరి ఈ వ్యవహారం పై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.