Viral Photo: సోషల్ మీడియా (Social Media) విస్తృతి పెరిగిన నాటి నుంచి సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా అందరూ నెట్టింట్లో సందడి చేస్తున్నారు. ఫోటోలు, వీడియోలతో రచ్చ చేస్తున్నారు. ఇలా ట్రెండింగ్‌లో నిలుస్తోన్న అంశాల్లో త్రో బ్యాక్ ఫోటోలు ఒకటి. చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇప్పుడు ఒక ట్రెండ్‌లా మారింది. సెలబ్రిటీలు సైతం తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు.
తాజాగా ఇలాంటి ఓ ఫోటోనే నెట్టింట వైరల్ అవుతోంది. పైన ఫోటోలో తెల్ల గౌను వేసుకొని ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడీ చిన్నారి ఓ స్టార్ హీరోయిన్. తమిళ, తెలుగు సినిమాల్లో రాణిస్తూ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తూ మెప్పిస్తోంది. ‘శృతి’గా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది కుర్రకారును మెస్మరైజ్ చేసింది. ‘సమీరా’గా థ్రిల్లర్ మూవీతో తనలోని నట విశ్వరూపాన్ని చూపించింది.
ఈ చిన్నరి ఎవరో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదూ! అవును మీరు అనుకుంటుంది నిజమే ఆ చిన్నారి మరెవరో కాదు రెజీనా కసాండ్రానే. తన అందంతో నటనతో ఆకట్టుకుంటోన్న ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. ఓవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా తన చిన్న తనంలో గౌను వేసుకొని దిగిన ఫోటోను షేర్ చేసింది. దీంతో ఈ ఫోటో వైరల్‌గా మారింది. ఇక రెజీనా కెరీర్ విషయానికొస్తే తెలుగు, తమిళంలో కలిపి ఏకంగా ఆరు సినిమాల్లో నటిస్తోంది. అంతేకాకుండా చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ఆచార్య చిత్రంలో ఐటెం సాంగ్‌లోనూ నటించిందీ బ్యూటీ.
Also Read: Accident: బైక్ పై నుంచి కిందపడి లేవబోతుండగా.. యువకుడి తలపై నుంచి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
Memu Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. శివారు ప్రాంతాలను కలుపుతూ మెము రైళ్లు