Viral Photo: ఎల్లోరా శిల్పం.. అందాల నయాగారం.. ఓర చూపులు చూస్తోన్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా!

|

Apr 08, 2022 | 8:20 PM

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. సెలబ్రిటీలైతే తమ డైలీ రొటీన్‌లో జరిగే విశేషాలను...

Viral Photo: ఎల్లోరా శిల్పం.. అందాల నయాగారం.. ఓర చూపులు చూస్తోన్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా!
Tollywood Heroine
Follow us on

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. సెలబ్రిటీలైతే తమ డైలీ రొటీన్‌లో జరిగే విశేషాలను, లేటెస్ట్ సినిమా అప్‌డేట్స్‌ను తమ అభిమానులతో ప్రతీ రోజూ పంచుకుంటుంటారు. అలాగే అప్పుడప్పుడూ ఇన్‌స్టా ద్వారా అభిమానులతో ఇంటరాక్ట్ అవుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ ఫోటో తాజాగా నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

పైన పేర్కొన్న ఫోటోలోని హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా.? ఈమె 20’sలో మోస్ట్ పాపులర్ టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరు. సినీ ఇండస్ట్రీలో 18 ఏళ్లుగా రాణిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉండి.. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుని పలు హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో నటించి మెప్పించింది. టాలీవుడ్‌లో అగ్ర హీరోల సరసన నటించిన ఈ చిన్నది రెండేళ్ల గ్యాప్ అనంతరం 2018లో మళ్లీ సినిమాల్లోకి కంబ్యాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ మలయాళంలో ఓ సినిమా చేస్తుండగా.. తెలుగులోనూ ఓ మూవీ చేయనుందని టాక్ నడుస్తోంది. ఈపాటికి మీకెవరో అర్ధమై ఉంటుంది.

మీరనుకున్నది కరెక్టే.. ఆమెవరో కాదు మీరా జాస్మిన్. 2004లో ‘అమ్మాయి బాగుంది’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మీరా జాస్మిన్.. ‘భద్ర’, ‘యమగోల మళ్లీ మొదలైంది’, ‘గోరింటాకు’, ‘మా అయన చంటి పిల్లాడు’ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. దాదాపు 9 ఏళ్ల తర్వాత మీరా జాస్మిన్ తెలుగులోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ నడుస్తోంది. రామ్ పోతినేని – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో మీరా జాస్మిన్ ఓ కీ రోల్ పోషించబోతోందని రూమర్స్ నడుస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.