Ananya Panday: ప్రియుడితో అనన్య బ్రేకప్.. అసలు విషయం చెప్పేసిన యంగ్ హీరో..

తాజాగా ఇదే విషయాన్ని యువ హీరో ఇషాన్ కాఫీ విత్ కరణ్ షోలో స్పష్టం చేశారు. కేవలం కరణ్ జోహర్ నిర్వహిస్తున్న ఈ షో వల్లే తాము విడిపోయామని చెప్పుకొచ్చాడు.

Ananya Panday: ప్రియుడితో అనన్య బ్రేకప్.. అసలు విషయం చెప్పేసిన యంగ్ హీరో..
Ishaan Ananya

Updated on: Sep 09, 2022 | 4:31 PM

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో అనన్య పాండే (Ananya Panday) ఒకరు. అతి తక్కువ సమయంలోనే భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ చిన్నది.. ఇటీవల లైగర్ సినిమాతో దక్షిణాది చిత్రపరిశ్రమకు పరిచయమైంది. ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా.. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించారు. అయితే అనన్య .. బీటౌన్ యంగ్ హీరో ఇషాన్ ఖట్టర్ ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. కానీ కొద్దిరోజుల క్రితం వీరిద్దరు విడిపోయినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఇదే విషయాన్ని యువ హీరో ఇషాన్ కాఫీ విత్ కరణ్ షోలో స్పష్టం చేశారు. కేవలం కరణ్ జోహర్ నిర్వహిస్తున్న ఈ షో వల్లే తాము విడిపోయామని చెప్పుకొచ్చాడు.

ఇటీవల మీరు అనన్యతో విడిపోయారా ? అని కరణ్ అడగ్గా.. మేము విడిపోలేదు. ఆమె నాతో విడిపోయింది. ప్రస్తుతం నేను ఒంటరిగా చాలా సంతోషంగా ఉన్నాను. జీవితాంతం ఆమెకు స్నేహితుడిగా ఉండాలని ఆశిస్తున్నాను. నాకు తెలిసిన అత్యంత అద్భుతమైన వ్యక్తులలో ఆమె ఒకరు. నాకు ప్రియమైన వ్యక్తి అంటూ చెప్పుకొచ్చాడు ఇషాన్. ఇక ఈ యంగ్ హీరో ధడక్ సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే .ఇదే మూవీతో దివంగత నటి శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ సైతం హీరోయిన్ గా సినీరంగ ప్రవేశంలో చేసింది. అయితే గతంలో జాహ్నవి, ఇషాన్ ప్రేమలో ఉన్నట్లు టాక్ నడించింది. కానీ అతి తక్కువ సమయంలోనే వీరిద్దరు విడిపోయారు.