
సోషల్ మీడియాతో పరిచయం ఉన్నవారికి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేని పేరు ఉర్ఫీ జావేద్.. స్వేచ్చా స్వాతంత్య్రం అంటూ బోల్డ్ గా మాట్లాడే ఈ ఫ్యాషన్ దుస్తులతో ఐకాన్ గా నిత్యం వార్తల్లో నిలిచే ఉర్ఫీ జావేద్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ముంబైలో శుక్రవారం ఉదయం ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. వైరల్ భయాని అనే ఫోటో గ్రాఫర్ షేర్ చేసిన ఈ వీడియోలో ఉర్ఫీ ఉదయం కాఫీ షాప్ నుంచి బయటకు వస్తూ కనిపించింది.. అప్పుడు ఆమెను పోలీసు అధికారుల బృందం అదుపులోకి తీసుకుంది. వీడియోలో ఒక మహిళా పోలీసు అధికారి తమతో పాటు పోలీస్ స్టేషన్‌కు రావాలని ఉర్ఫీని కోరింది. తనను కస్టడీలోకి తీసుకోవడానికి గల కారణాన్ని ఉర్ఫీ ప్రశ్నించగా, ఆ అధికారి ఆ ప్రశ్నకు “ఇంత చిన్న చిన్న దుస్తులను వేసుకున్నావు కదా అంటూ బదులిచ్చింది.
ఉర్ఫీ తన కాఫీ రన్ నుంచి వచ్చే సమయంలో డెనిమ్ ప్యాంట్‌తో బ్యాక్‌లెస్ రెడ్ టాప్ ధరించి కనిపించింది. ఉర్ఫీ మళ్లీ అధికారిని కారణం అడగడంతో.. పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్‌కి రమ్మనమని కోరారు. ఆమె చేతులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ సంఘటన నిజమా లేదా ఫ్రాంక్ అన్న విషయం లేదా వీడియో ప్రామాణికతను టీవీ 9 ధృవీకరించలేదు.
నెటిజన్లు కూడా ఈ వీడియో ప్రామాణికతపై గందరగోళానికి గురవుతున్నారు. “ఇది ఉర్ఫీ చేసిన చిలిపిగా మాత్రమే కనిపిస్తోంది” అని ఒకరు కామెంట్ చేయగా.. ఇది ఒక ఫ్రాంక్ వీడియో అంటూ మరొకరు కామెంట్ చేశారు.
అయితే గత కొంతకాలంగా ఉర్ఫీ ఫ్యాషన్ దుస్తుల ఎంపికతో ఇబ్బందుల్లో పడింది. గత నెలలో బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫ్యాషన్ దుస్తులపై ఫిర్యాదు దాఖలైంది. ఈ విషయాన్నీ షి టీమ్స్ నివేదించింది. నటి వెంటనే పోలీసు స్టేషన్‌కు వెళ్లింది.
దుస్తుల ఎంపికల కారణంగా తరచుగా ఉర్ఫీ ని ట్రోల్ చేస్తూ చేస్తూ ఉంటారు. బిగ్ బాస్ OTT ఫేమ్ ఎప్పుడూ వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. అంతకు ముందు ఒక ఇంటర్వ్యూలో ఉర్ఫీ తనపై ఫిర్యాదులు చేస్తున్న వారిపై విరుచుకుపడింది. తాను సురక్షితంగా లేదని పేర్కొంది. అయినప్పటికీ.. తన దుస్తుల ఎంపికను సమర్థించుకుంది. తాను ధరించే దుస్తులు పరిశ్రమ దృష్టిని ఆకర్షించడానికో.. జనాదరణ పొందడం కోసం వారి దృష్టిని ఆకర్షించడం గురించి కాదు.. తాను ధరించే దుస్తుల విషయంలో తప్పు ఏమిటి?” అంటూ ప్రశ్నించింది. అంతేకాదు ‘ఇలాంటి బట్టలు’ ధరిస్తుందని తాను మాత్రమే కాదని, సోషల్ మీడియాలో బికినీ చిత్రాలను పంచుకునే చాలా మంది అమ్మాయిలు ఉన్నారని వాదించింది ఉర్ఫీ జావేద్.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..