Viral Video: వేసవి నుంచి ఉపశమనం కోసం తలపై ఫ్యాన్.. తల్లి కనిపెట్టిన యంత్రం అంటున్న అమితాబ్..

|

Apr 03, 2023 | 2:48 PM

ఈ వేసవి నుండి ఉపశమనం కోసం తనను తాను చల్లగా ఉంచుకోవడానికి "ఇండియా ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ .." అని క్యాప్షన్ తో షేర్ చేశారు. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది అని తెలిపారు అమితాబ్ బచ్చన్.

Viral Video: వేసవి నుంచి ఉపశమనం కోసం తలపై ఫ్యాన్.. తల్లి కనిపెట్టిన యంత్రం అంటున్న అమితాబ్..
Fan Viral Video
Follow us on

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ 40 ఏళ్లకు పైగా హీరోగా , విభిన్న పాత్రలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే బుల్లితెరపై హోస్ట్ గా అలరిస్తున్నారు. తరచుగా తన ఫ్యాన్స్ తో బ్లాగ్స్ ఇంటరాక్ట్  అవుతారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా బిగ్ బీ అమితాబ్ తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఒక వృద్ధుడు హెల్మెట్ ను ధరించి నడుస్తున్నాడు. అయితే ఆ హెల్మెట్ స్పెషాలిటీ ఏమిటంటే.. దానికి ఒక ఫ్యాన్స్ బిగించి ఉంది. అది సోలార్ ప్యానెల్ తో పనిచేస్తుంది.

ఈ వేసవి నుండి ఉపశమనం కోసం తనను తాను చల్లగా ఉంచుకోవడానికి “ఇండియా ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ ..” అని క్యాప్షన్ తో షేర్ చేశారు. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది అని తెలిపారు అమితాబ్ బచ్చన్.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో లైక్స్ షేర్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అంతేకాదు  భారతదేశాన్ని టెక్ గా మార్చే .. నూతన ఆవిష్కరణలు, పొదుపు కోసం తయారు చేసే రిసోర్స్‌ఫుల్ ఆవిష్కరణ అని కామెంట్ చేశారు. అయితే మరొకరు ఈ పోస్ట్ పై మరొకరు కామెంట్ చేస్తూ.. ఈ వీడియో ఉత్తర ప్రదేశ్ లోని లఖీమపూర్ జిల్లాలోని అని చెప్పారు. అంతేకాదు ఈ వేసవిలో ఎండ వేడి నుంచి రక్షణ ఇచ్చేందుకు హెల్మెట్.. వేసవిలో ఎండ నుంచి ఉపశమనం కోసం ఫ్యాన్ ను ధర్మేంద్ర బాబా ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..