Lata Mangeshkar: లతాజీని కలవనందుకు చింతిస్తున్నా.. లెజెండరీ సింగర్‌తో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న పాక్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌..

వేలాది పాటలతో కోట్లాది మంది హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు ప్రముఖ గాయని లతామంగేష్కర్‌ (Lata Mangeshkar).

Lata Mangeshkar: లతాజీని కలవనందుకు చింతిస్తున్నా.. లెజెండరీ సింగర్‌తో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న పాక్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌..

Updated on: Feb 08, 2022 | 9:55 AM

వేలాది పాటలతో కోట్లాది మంది హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు ప్రముఖ గాయని లతామంగేష్కర్‌ (Lata Mangeshkar). సంగీతానికి సరిహద్దుల్లేవని నిరూపిస్తూ తన తియ్యటి స్వరంతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారామె. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆమె ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆరోజు సాయంత్రం ముంబయి(Mumbai) లోని శివాజీ పార్క్‌లో అశ్రునయనాల మధ్య లెజెండరీ సింగర్‌ అంత్యక్రియలు జరిగాయి. అయితే ఇకపై ఆమె గొంతు ఇక వినిపించదన్న వార్తను చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఈక్రమంలో సోషల్‌ మీడియా వేదికగా ఆమెతో తమ మధుర క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. తాజాగా పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ (Shoaib Akhtar) తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా లతాజీకి నివాళి అర్పించాడు. ఈ సందర్భంగా ఆమెతో తన పాత జ్ఞాపకాలను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యాడు.

అమ్మా అని పిలవమన్నారు..

‘నేను లతాజీకి పెద్ద అభిమానిని. 2016లో ఒక పని నిమిత్తం నేను ముంబయికి వచ్చాను. అప్పుడు ఆమెతో ఫోన్‌లో మాట్లాడే అదృష్టం నాకు వచ్చింది. నేను ‘లతాజీ’ అని సంబోధించగానే.. అవతలి నుంచి ఆమె ‘నన్ను మా(అమ్మా)’ అని పిలవొచ్చు అన్నారు. ఆ సమయంలో ఆమె చూపించిన ప్రేమానురాగాలను నేను ఎప్పుడూ మర్చిపోలేను. నేనంటే కూడా ఆమెకు చాలా ఇష్టమన్నారు. ముఖ్యంగా క్రికెట్‌ మైదానంలో సచిన్‌, నా మధ్య జరిగే పోరాటాన్ని చూడడమంటే చాలా ఇష్టమన్నారు. గ్రౌండ్‌లో నేను అగ్రెసివ్‌గా వ్యవహరించే తీరును కూడా లతాజీ మెచ్చుకున్నారు. దీంతో వెంటనే ఆమెను కలవాలనుకున్నాను. ఇదే విషయాన్ని లతాజీకి చెప్పాను. అయితే ఆసమయంలో ఆమె నవరాత్రి ఉపవాసంలో ఉన్నారు. ఫాస్టింగ్‌ పూర్తయిన వెంటనే కలుద్దామన్నారు. అయితే అప్పటికే నేను ఫ్లైట్‌ టికెట్‌ను బుక్‌ చేసుకున్నానని చెప్పడంతో ఆమె స్వరంలో కొంచెం మార్పు వచ్చింది. అయినా కూడా ఆమె తన ఫోన్‌ కాల్‌ను కొనసాగించారు. ఇప్పుడు కాకపోయినా త్వరలోనే మనం కలుసుకుంటామన్నారు. దురదృష్టవశాత్తూ ఆ తర్వాత లతాజీని నేను కలుసుకోలేకపోయాను. అందుకెంతో చింతిస్తున్నాను’ అంటూ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో చెప్పుకొచ్చాడు అక్తర్‌.

Also Read:Petrol Price Today: వాహనదారులకు ఊరట.. ఈరోజు కూడా స్థిరంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..

IND vs WI: ఆ ఆటగాడికి 10 రేటింగ్ ఇచ్చిన సునీల్ గవాస్కర్.. అతడు ఎవరంటే..

Viral Video: ఆమె ఐడియా.. జీవితాన్నే మార్చేసింది..! పిల్లల కోసం వినూత్న ప్రయోగం.. చివరికి సక్సెస్..(వీడియో)