Shahrukh Khan : బాలీవుడ్ లో కూడా క్రేజీ కాంబినేషన్లు రిపీట్ అవుతున్నాయి. హిస్టారిక్ సినిమాల స్పెషలిస్ట్ సంజయ్ లీలా భన్సాలీ.. ఈసారి కింగ్ ఖాన్ తో జట్టు కట్టబోతున్నారు. వీళ్లిద్దరి కాంబోలో పంతొమ్మిదేళ్ల కిందట దేవ్ దాస్ మూవీ వచ్చింది. మళ్ళీ రెండు దశాబ్దాల గ్యాప్ తో సినిమా అంటే.. కంటెంట్ కూడా అదే రేంజ్ లో ఉండాలిగా..!
‘ఇజార్’… ఇష్టసఖి కోసం ఇండియా నుంచి నార్వేకు సైకిల్ యాత్ర చేసిన క్యారెక్టర్ పేరిది. అతడి పర్సనల్ లైఫ్ ని ఇన్ స్పిరేషన్ గా తీసుకుని.. షారుఖ్ తో సినిమా చేయబోతున్నారు భన్సాలీ. ఇప్పుడు సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో ‘పఠాన్’ మూవీ చేస్తున్నారు షారుఖ్. అది కంప్లీట్ కాగానే.. ఈ సైకిల్ వీరుడి గెటప్ లోకి మారిపోతారట.
భన్సాలీ మార్క్ ట్రీట్మెంట్ అంటేనే ఆ రిచ్ నెస్సే వేరు. ఒక భారతీయుడికి, నార్వే మహిళకు మధ్య సాగే ఈ ప్రేమ కథను సంజయ్ మాస్టర్ తెరకెక్కిస్తే ఎలా ఉంటుందో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు బీ టౌన్ ఆడియెన్స్. అసలే.. తమ హీరో నుంచి రీసెంట్ టైంలో మంచి సినిమా లేక ఆకలితో వున్నారు షారూఖ్ ఫ్యాన్స్. కొందరైతే.. దిల్వాలే దుల్హేనియా రోజుల్ని రీకాల్ చేసుకుంటున్నారు. ఇక షారుక్ గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్నాడు. చివరిగా వచ్చిన ఫ్యాన్, జీరో సినిమాలు దారుణంగా నిరాశపరిచాయి. ప్రస్తుతం యష్ ఫిలిం బ్యానర్ లో పఠాన్ సినిమా చేస్తున్నాడు. సినిమాలో దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :