Actress Rakul Preet Singh: రకుల్ సినిమా షూటింగ్ పై రాళ్లదాడికి దిగిన స్థానికులు.. కారణమెంటో తెలుసా..

|

Feb 23, 2021 | 12:54 PM

ఇటు తెలుగులోనే కాకుండా..హిందీలోనూ వరుస సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా మారిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం

Actress Rakul Preet Singh: రకుల్ సినిమా షూటింగ్ పై రాళ్లదాడికి దిగిన స్థానికులు.. కారణమెంటో తెలుసా..
Follow us on

ఇటు తెలుగులోనే కాకుండా..హిందీలోనూ వరుస సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా మారిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం సరసన ‘ఎటాక్’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకు లక్ష్యరాజ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ ఉత్తర్ ప్రదేశ్‏లోని ధనిపూర్‏లో ప్రారంభమైంది. ఇందులో భాగాగం ఈ సినిమాలో కొన్ని యాక్షన్స్ సన్నివేశాలు, బాంబా బ్లాస్ట్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సినిమా షూటింగ్ పై స్థానికులు రాళ్ళదాడి చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

జాన్ అబ్రహం, రకుల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 13న విడుదల చేయనున్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులోని యాక్షన్ సన్నివేశాల కోసం ధనిపూర్ వెళ్లింది చిత్రయూనిట్. ఇక తమ సమీపంలోనే సినిమా షూట్ చేస్తున్నారని తెలిసిన స్థానికులు వారిని చూడడానికి పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. కానీ షూటింగ్ స్పాట్ వద్ద గేటు మూసేయడంతో సెట్ గోడ ఎక్కి షూటింగ్ చూడాటానికి జనం ప్రయత్నించారు. ఈ క్రమంలోనే సెక్యూరిటీ సిబ్బందికి స్థానికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ప్రజలు రాళ్ళదాడికి పాల్పడ్డారు. వెంటనే పోలీసులు వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా ఈ ఘటనలో చిత్రయూనిట్‏కు ఎలాంటి గాయాలు కాలేదు.

Also Read:  బాలకృష్ణ- బోయపాటి మూవీ.. స్క్రిప్ట్‌లో పలు మార్పులు.. ఆ పాత్రను తీసేస్తున్నారా..!