Nora Fatehi: రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో మరో హీరోయిన్‏కు నోటీసులు.. నోరా ఫతేహిని విచారించనున్న పోలీసులు..

|

Sep 15, 2022 | 9:41 AM

విచారణ సమయంలో జాక్వెలిన్, పింకీ ఇరానీలు చెప్పిన సమాధానాలు స్పష్టంగా లేవని.. వారిని మరోసారి విచారించనున్నట్లు తెలుస్తోందీ. పింకీ ఇరానీ గురువారం సైతం పోలీసుల ఎదుట హాజరుకావాల్సి ఉంది.

Nora Fatehi: రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో మరో హీరోయిన్‏కు నోటీసులు.. నోరా ఫతేహిని విచారించనున్న పోలీసులు..
Nora Fatehi
Follow us on

బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా బుధవారం ఆమె ఢిల్లీ పోలీసుల ఎదుట హాజరయ్యారు. అయితే ఈ కేసులో విచారణకు రావాలంటూ గతంలో అనేకసార్లు ఆమెకు నోటీసులు జారీ చేసింది ఈడీ. దోపిడీ, మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్‏తో సాన్నిహిత్యంగా ఉండడం.. అతని నుంచి విలువైన కానుకలు పొందినట్లుగా జాక్వెలిన్ పేరు మీద ఛార్జీషీటు ధాఖలు చేసింది ఈడీ. బుధవారం ఉదయం 11.30 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆమెను విచారించారు పోలీసులు. ఇక జాక్వెలిన్ మాత్రమే కాకుండా.. మరో హీరోయిన్‏కు షాకిచ్చారు ఢిల్లీ పోలీసులు. నటి నోరా ఫతేహిని (Nora Fatehi) గురువారం విచారణకు హజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు. విచారణ సమయంలో జాక్వెలిన్, పింకీ ఇరానీలు చెప్పిన సమాధానాలు స్పష్టంగా లేవని.. వారిని మరోసారి విచారించనున్నట్లు తెలుస్తోందీ. పింకీ ఇరానీ గురువారం సైతం పోలీసుల ఎదుట హాజరుకావాల్సి ఉంది.

అయితే నోరా ఫతేహికి జాక్వెలిన్ తో ప్రత్యక్ష సంబంధం లేదని.. కేవలం పింకీ ఇరానితో ఉన్న సంబంధం దృష్ట్యా ఆమెను విచారణ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. గురువారం పింకీ ఇరానితోపాటు నోరా ఫతేహిని సైతం విచారించనున్నారు. ఈ కేసుకు సంబంధఇంచి నోరా ఫతేహికి.. జాక్వెలిన్ మధ్య ఎలాంటి స్నేహబంధం లేదని స్పెషల్ కమిషనల్ రవీంద్ర యాదవ్ తెలిపారు. ఇక గతంలో సెప్టెంబర్ 2న దోపిడీ కేసులో నోరా ఫతేహిని దాదాపు ఏడు గంటలపాటు విచారించి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు పోలీసులు. సుఖేష్ చంద్రశేఖర్ నుంచి నోరా కూడా బహుమతులు అందుకుందని.. క్రైమ్ సిండికేట్ తో సంబంధాలు ఉన్న చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గోన్నట్లుగా తెలుస్తోంది. అయితే తాను పాల్గోన్న కార్యక్రమంకు .. మనీలాండరింగ్ కేసుకు సంబంధం ఉన్నట్లు తనకు తెలియదని గతంలోనే చెప్పేసింది నోరా. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి చంద్రశేఖర్ నుండి లగ్జరీ కార్లు, ఇతర ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు ఈడీ తెలిపింది. ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్ వంటి ప్రముఖ వ్యక్తులతో సహా పలువురిని మోసం చేశాడని ఆరోపణలతో ప్రస్తుతం జైల్లో ఉన్నాడు సుకేష్ చంద్రశేఖర్‌.