Song Controversy : ఛీ ఛీ.. ఇదేం సాంగ్.. మరీ ఇంత నీచంగా తీస్తారా.. ? నోరా ఫతేహి పాటపై విమర్శలు..

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ పాటలతో తనదైన ముద్ర వేసింది హీరోయిన్ నోరా ఫతేహి. హై ఎనర్జీ డ్యాన్స్ నంబర్లతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఆమె చేసిన ఓ పాటపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అందులో అశ్లీలత ఎక్కువైందంటూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు నెటిజన్స్.ఇంతకీ ఏం జరిగిందంటే..

Song Controversy : ఛీ ఛీ.. ఇదేం సాంగ్.. మరీ ఇంత నీచంగా తీస్తారా.. ? నోరా ఫతేహి పాటపై విమర్శలు..
Nora Fatehi Song

Updated on: Mar 17, 2026 | 9:38 AM

బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. హిందీ సినిమాల్లో స్పెషల్ పాటలు.. హై ఎనర్జీ డ్యాన్సులతో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. కేవలం నార్త్ లోనే కాకుండా ఇటు సౌత్ లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, కన్నడ, హిందీ భాషలలో పలు చిత్రాల్లో స్పెషల్ పాటలతో అలరించింది. అయితే తాజాగా ఈ అమ్మడు ఇప్పుడు చిక్కుల్లో పడింది. లేటేస్ట్ గా నోరా చేసిన ఓ సాంగ్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు. బీటౌన్ నటుడు సంజయ్ దత్, నోరా ఫతేహి కలిసి చేసిన కొత్త సాంగ్ సర్కే చునార్ తేరి సర్కే. ఇటీవల విడుదలైన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ పాట విడుదలైన వెంటనే వైరల్ అయినప్పటికీ, కొంతమంది ప్రేక్షకులు సాహిత్యంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఎక్కువమంది చదివినవి : Jabardasth Naresh: నెలకు 13 ఈవెంట్స్ చేస్తా.. ఒక్కో ఈవెంట్‏కు ఎంత తీసుకుంటానంటే.. జబర్దస్త్ నరేష్..

ఈ పాట రాబోయే చిత్రం ‘కెడి: ది డెవిల్’ లో తెరకెక్కించారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ పాటలో సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే నోరా ఫతేహి స్పెషల్ సాంగ్ చేసింది. తాజాగా విడుదలైన ఈ స్పెషల్ సాంగ్ ఇప్పుడు బీజీఎమ్, డ్యాన్స్ కారణంగా ప్రేక్షకులకు త్వరగా దగ్గరైంది. ఈ పాటలో నోరా ఫతేహి పలువురు బ్యాకప్ డ్యాన్సర్లతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఈ పాటను ఒక డ్యాన్స్ బార్ సెట్‌లో చిత్రీకరించారు. అయితే ఇందులో సాంగ్ డబుల్ మీనింగ్ ఉందని.. అలాగే నోరా ధరించిన డ్రెస్సు మరింత జుగుప్సాకరంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లును సుడిగాలి సుధీర్‏కు అమ్మేశా.. టాలీవుడ్ నటుడు..

అలాగే ఈ పాటలోని డ్యాన్స్ పై సైతం విమర్శలు వస్తున్నాయి. పాటలోని సాహిత్యం.. నోరా డ్రెస్సింగ్.. అలాగే కొన్ని హుక్ స్టెప్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘సర్కే చునార్ తేరీ సర్కే’ పాట సాహిత్యాన్ని గీత రచయిత రకీబ్ ఆలం రచించగా, సంగీతాన్ని అర్జున్ జన్య అందించారు. ఈ పాటను మంగ్లీ పాడింది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆమెకు 15.. అతడికి 24.. పదేళ్లుగా సీక్రెట్ లవ్.. కట్ చేస్తే.. భార్యభర్తలుగా ఒక్కటైన హీరోహీరోయిన్..

ఎక్కువమంది చదివినవి : Appa Rao: ఆ సినిమా సమయంలో చేసిన పని.. నా ఫేస్ మొత్తం బ్లాక్ అయ్యింది.. జబర్దస్త్ అప్పారావు..

Follow Us