Rhea Chakraborty : యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం తెలిసిందే. సుశాంత్ మరణంలో డ్రగ్స్ కోణం ఉన్నట్టుగా ఎన్సీబీ అధికారుల విచారణ వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ కోణంలో బాలీవుడ్ హీరోయిన్ సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి పేరు బయటకు రావడం సంచలనం సృష్టించింది. సుశాంత్ మరణానికి రియా నే కారణం అంటూ కొందరు అభిమానులు ఆరోపించారు. ఇక డ్రగ్స్ విషయంలో రియాను పోలీసులు విచారించగా ఆమెకు డ్రగ్స్ సప్లేయిర్స్ తో సంబంధాలు ఉన్నాయని తేలింది. దాంతో ఆమెని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలం జైలు జీవితం అనుభవించిన తర్వాత రియా బెయిలు పై బయటకు వచ్చింది.
తాజాగా డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇచ్చిన చార్జిషీట్‌లో రియా చక్రవర్తి తోపాటు 32 మందికి డ్రగ్స్ డీలర్స్ తో సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. ఎన్‌డిపిఎస్ చట్టంలోని సెక్షన్ 27 ఎ కింద కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష, గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలుస్తుంది. 2019 నవంబర్‌లో, రియా నివాసంలో డ్రగ్స్ సప్లేయి జరిగిందని, రియా ఆమె ప్రియుడు సుశాంత్ సింగ్ ఇద్దరు రియా ఇంట్లోనే డ్రగ్స్ సేవించేవారని ఆరోపించింది ఎన్సీబీ. అలాగే డ్రగ్స్ వ్యవహారాలకు సంబంధించిన కార్యకలాపాలకు ఆమె ఆర్థిక సహాయం చేసిందని. రియా చక్రవర్తి తన సోదరుడు షోవిక్ చక్రవర్తి సహాయంతో డ్రగ్స్ కొనుగోలు చేయడం వంటివి చేసిందని ”అని ఎన్సీబీ తెలిపింది.
అక్టోబర్ 7 న, బాంబే హైకోర్టు, రియా బెయిల్ మంజూరు చేస్తున్నప్పుడు, ఆమె మాదకద్రవ్యాల వ్యాపారానికి ఆర్థిక సహాయం చేసినట్లు ఆధారాలు లేవని తేలింది.
రియా, షోయిక్, సుశాంత్ కుక్ దీపేశ్ సావంత్, హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండా , నిందితుడు రిషికేశ్ పవార్ డ్రగ్స్ సేకరించి దివంగత నటుడికి సరఫరా చేసినట్లు చార్జిషీట్‌లో పేర్కొంది ఎన్సీబీ. వీరిలో చాలా మంది నిందితులు బెయిల్‌పై ఉండగా, ఎనిమిది మంది ఇంకా జైలులో ఉన్నారు. కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసినట్లు ఎంసీబీ తెలిపింది. కోమల్ రాంపాల్, స్వప్న పబ్బి, కరిష్మా ప్రకాష్ మరియు 14 మందిపై త్వరలో ప్రత్యేక చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతుందని త్వరలోనే మరిన్ని వివరాలు తెలుపుతామని ఎన్సీబీ తెలిపింది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Vijay Deverakonda : సుకుమార్ సినిమాలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ అలా కనిపించబోతున్నాడా..?