Bollywood: మంచు కొండల్లో షూటింగ్ బెటర్ అంటున్న దర్శక నిర్మాతలు..

|

Apr 30, 2023 | 11:17 AM

పఠాన్ సక్సెస్ తరువాత డంకీ వర్క్‌లో బిజీగా ఉన్న షారూఖ్‌ ఖాన్, ప్రజెంట్ కశ్మీర్‌లో షూటింగ్ చేస్తున్నారు. రాజ్‌ కుమార్ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలు కశ్మీర్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో షారూఖ్‌తో పాటు తాప్సీ కూడా పాల్గొంటున్నారు.

Bollywood: మంచు కొండల్లో షూటింగ్ బెటర్ అంటున్న దర్శక నిర్మాతలు..
Bollywood
Follow us on

ప్రజెంట్ బాలీవుడ్ స్టార్స్ అంతా చలో కశ్మీర్ అంటున్నారు. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ప్రతీ ఒక్కరు సమ్మర్ సీజన్‌ను మంచు కొండల్లో స్పెండ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే షూటింగ్ షెడ్యూల్స్‌ను కూడా అలాగే ప్లాన్ చేసుకుంటున్నారు. పఠాన్ సక్సెస్ తరువాత డంకీ వర్క్‌లో బిజీగా ఉన్న షారూఖ్‌ ఖాన్, ప్రజెంట్ కశ్మీర్‌లో షూటింగ్ చేస్తున్నారు. రాజ్‌ కుమార్ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలు కశ్మీర్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో షారూఖ్‌తో పాటు తాప్సీ కూడా పాల్గొంటున్నారు. కరణ్ జోహర్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ డ్రామా రాకీ ఔర్‌ రాణీకి ప్రేమ్ కహాని. రణవీర్ సింగ్‌, ఆలియా భట్‌ జంటగా రూపొందుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌ కశ్మీర్‌లో కంప్లీట్ అయ్యింది. ఒక సాంగ్‌తో పాటు కొన్ని కీ సీన్స్‌ను కశ్మీర్‌లో చిత్రీకరించారు మేకర్స్‌.

స్నో యాక్షన్‌ స్పెషలిస్ట్‌ సిద్దార్థ్ ఆనంద్ కూడా ఫైటర్ టీమ్‌తో కలిసి కశ్మీర్‌లోనే మకాం వేశారు. ఇండియాస్ ఫస్ట్ ఏరియల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న మూవీకి సంబంధించి హై ఆక్టెన్ యాక్షన్‌ సీన్స్‌ను ఈ షెడ్యూల్‌లో ప్లాన్ చేశారు. హృతిక్‌తో పాటు దీపిక కూడా ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

యంగ్ సెన్సేషన్‌ కార్తీక్ ఆర్యన్ కూడా ఈ మధ్యే కశ్మీర్ వ్యాలీ నుంచి రిటర్న్ అయ్యారు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న సత్యప్రేమ్‌ కీ కథ సినిమా లాస్ట్ షెడ్యూల్ కశ్మీర్‌లో జరిగింది. ఈ షెడ్యూల్‌లో కార్తీక్‌, కియారాలపై ఓ రొమాంటిక్‌ సాంగ్‌ను చిత్రీకరించారు.ఇలా బాలీవుడ్ స్టార్స్ అంతా కశ్మీర్ బాట పట్టడంతో సమ్మర్ సీజన్‌లో మంచు కొండలకు మరింత గ్లామర్ యాడ్ అవుతోంది.