బాలీవుడ్ హీరోయిన్స్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez).. నోరా ఫతేహి మనీలాండరింగ్ కేసులో చిక్కుకుని బయటకు రాలేక విలవిలలాడిపోతున్నారు. ఈడీ విచారణలో ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఢిల్లీ పోలీసుల విచారణలో పలు విషయాలు బయట పడుతున్నాయి. దీంతో వీరిద్దరి మరింత ఉచ్చు బిగుస్తోంది. రూ. 200 కోట్ల దోపిడీ, మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రభోస్తో వీరికి సంబంధం ఉన్నట్లుగా ఈడీ చార్జీ షీట్ ధాఖలు చేసింది. ఈ క్రమంలోనే ఇటీవల వీరిద్దరిని విచారించింది ఈడీ. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ కేసులో జాక్వెలిన్, నోరా ఫతేహికి ప్రత్యక్ష సంబంధం లేదని పేర్కొంది ఈడీ. కానీ జాక్వెలిన్ సుకేష్ చంద్రబోస్ ను డ్రీమ్ బాయ్‌గా భావించిందని.. అతడిని పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు తెలుస్తోంది. ఆమెను సుకేష్ తనను పెళ్లి చేసుకునేందుకు ఒప్పించాడని.. అతడి గురించి వాస్తవాలు తెలిసిన తర్వాత కూడా సుకేష్ తో జాక్వెలిన్ టచ్‌లో ఉందని తెలిపారు పోలీసులు. అయితే సుకేష్ ప్రవర్తన పై అనుమానం వచ్చిన నోరా ఫతేహి అతనితో డిస్ కనెక్ట్ అయ్యిందని.. అతడికి దూరంగా ఉంటుందని స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవీందర్ యాదవ్ తెలిపారు.
అంతేకాకుండా.. జాక్వెలిన్ మేనేజర్ ప్రశాంత్ నుంచి దాదాపు 8 లక్షల విలువైన బైక్ స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. ఈ బైక్‌ను సుకేష్ బహుమతిగా ఇచ్చినట్లు నిర్దారించారు. అయితే నోరా ఫతేహి ఎప్పుడు సుఖేష్ చంద్రశేఖర్ ను వ్యక్తిగతంగా కలవలేదని.. కేవలం అతనితో వాట్సాప్‌లో రెండు సార్లు మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. నోరా ఫతేహితోపాటు.. ఆమె బావమరిది మెహబూబ్ అకా బాబీ ఖాన్, పింకీ ఇరానీని సుకేష్ చంద్రబోస్‌కు కంటాక్ట్ అయ్యారు. వీరికి ఖరీదైన బహుమతులు అందించినట్లుగా తెలుస్తోంది. అలాగే.. సుకేష్, లీనా మరియా యాజమాన్యంలోని చెన్నై స్టూడియోలో జరిగిన ఓ కార్యక్రమానికి నోరా ఫతేహి హాజరుకావాల్సి ఉంది. ఇందుకోసం ఆమెకు భారీ మొత్తంలో పారితోషికం, బీఎండబ్ల్యూ కారు ఆఫర్ చేశారు. కానీ వీటిని నోరా ఫతేహి రిజెక్ట్ చేసిం..వాటిని మెహబూబ్ అకా బాబీ ఖాన్‌కు ఇవ్వాలని తెలిపింది. మొత్తానికి ఈ మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ కు మరిన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.