మొన్నటివరకు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్.. UPSCలో తొలి ప్రయత్నంలోనే విజయం.. ఎవరంటే?

నటనపై ఆసక్తితో పెద్ద పెద్ద ఉద్యోగాలను సైతం వదులుకుని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వారు చాలా మందే ఉన్నారు. అయితే ఈమె మాత్రం చాలా డిఫరెంట్. మొన్నటివరకు సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె పవర్ ఫుల్ ఐపీఎస్‌ అధికారి అయ్యారు. లేడీ సింగంగా అందరి మన్ననలు అందుకుంటున్నారు.

మొన్నటివరకు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్.. UPSCలో తొలి ప్రయత్నంలోనే విజయం.. ఎవరంటే?
Simala Prasad Inspiring Story

Updated on: Jan 14, 2026 | 7:00 PM

యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటి. IAS, IPS వంటి ప్రతిష్ఠాత్మకమైన ఉద్యోగాలను అందుకోవడానికి లక్షలాది మంది రేయింబవళ్లు కష్టపడతారు. అలాంటిది ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యింది. క్లిష్టమైన పరీక్షలో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు లేడీ సింగంగా దేశవ్యాప్తంగా మన్ననలు అందుకుంటోంది. సాధారణంగా ఇంట్లో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటే పిల్లలు కూడా అదే దారిలోనే వెళతారు. కానీ ఈమె కొంచెం డిఫరెంట్ రూట్ లో వెళ్లింది. ఇంట్లో తండ్రి ఐఏఎస్ అధికారిగా ఉన్నప్పటికీ సివిల్ సర్వీసెస్ వైపు చూడలేదు. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకుంది. డ్యాన్స్ లోనూ ట్రైనింగ్ తీసుకుంది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కొన్ని సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. కానీ జీవితంలో ఇంకా ఏదో సాధించాలనుకుంది. సినిమాలు చేస్తూనే ఉన్నత చదువులు అభ్యసించింది. సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్త చేసింది. ఆ తర్వాత స్టేట్ పబ్లిక్ కమిషన్ పరీక్షలోనూ మంచి ర్యాంక్ సాధించింది. DSP గా పోస్టింగ్ కూడా వచ్చింది. కానీ అంతటితో సంతృప్తి చెందలేదు. అంతకు మించి ఏదో సాధించాలన్న తపనతో ముందుకు సాగింది. యూపీఎస్సీ పరీక్షకు కూడా ప్రిపేర్ అయ్యింది. ఆమె పట్టుదల, కఠోర శ్రమ ఫలించి, మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ ను క్రాక్ చేసింది. అది కూడా ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే. ప్రస్తుతం లేడీ సింగమ్ గా అందరి మన్ననలు అందుకుంటోన్న ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా?

సిమల ప్రసాద్.. తెలుగు ఆడియెన్స్ కు ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు కానీ బాలీవుడ్ ఆడియెన్స్ కు ఈ నటి బాగా పరిచయం. మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన ఈమె బి.కామ్ చదువుతున్నప్పుడే పలు నాటకాల్లో నటించింది. ఇదే క్రమంలో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 2017లో ‘అలీఫ్’ , 2019లో విడుదలైన ‘నకాష్’ చిత్రాల్లో సిమల ప్రధాన పాత్రలు పోషించింది. అయితే సినిమాల్లో నటిస్తూనే ఉన్నత చదువులు పూర్తి చేసింది సిమల ప్రసాద్. ఆ తర్వాత పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యిది.

ఇవి కూడా చదవండి

నేటి అమ్మాయిలకు స్ఫూర్తిగా సిమల ప్రసాద్ లైఫ్ స్టోరీ..

ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హోదాను దక్కించుకున్నారు. అంతటితో విశ్రమించకుండా యూపీఎస్సీ పరీక్షపై దృష్టిపెట్టారు. తొలిప్రయత్నంలోనే అది కూడా ఎలాంటి కోచింగ్‌ లేకుండానే పరీక్షలో విజయం సాధించారు. ప్రస్తుతం సిమల ప్రసాద్ రైల్వే ఎస్పీగా సేవలు అందిస్తున్నారు.

ఎంటర్ టైన్మెంట్ రంగం నుంచి ప్రజాసేవకు మరలిన సిమల ప్రసాద్ స్టోరీ నేటి జనరేషన్ కు ఆదర్శమని చెప్పవచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.