Manisha Koirala: ప్రయాణం కష్టమైనదని నాకు తెలుసు.. అయినా కొనసాగించాలి.. మనీషా కోయిరాలా..

జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా జీవితంపై ఆసక్తికరమైన పోస్ట్‎ను ఇన్‎స్టాలో పోస్ట్ చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం క్యాన్సర్‌తో పోరాడిన ఆమె క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నప్పటి నుంచి తన పాత చిత్రాలను పంచుకుంది...

Manisha Koirala: ప్రయాణం కష్టమైనదని నాకు తెలుసు.. అయినా కొనసాగించాలి.. మనీషా కోయిరాలా..
Manish

Updated on: Nov 07, 2021 | 9:23 PM

జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా క్యాన్సర్ చికిత్సపై ఆసక్తికరమైన పోస్ట్‎ను ఇన్‎స్టాలో పోస్ట్ చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం క్యాన్సర్‌తో పోరాడిన ఆమె క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నప్పటి నుంచి తన పాత చిత్రాలను పంచుకుంది. “ఈ జాతీయ క్యాన్సర్ అవేర్‌నెస్ డే సందర్భంగా, ఈ కష్టతరమైన క్యాన్సర్ ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చికిత్స, చాలా ప్రేమ, విజయం. ‘ప్రయాణం కష్టమైనదని నాకు తెలుసు, కానీ నువ్వు దానికంటే కఠినంగా ఉన్నావు.’ దానికి లొంగిపోయిన వారికి నా నివాళులర్పించాలని, దానిని జయించిన వారితో ఆనందం పంచుకోవాలని కోరుకుంటున్నాను.” “మేము వ్యాధిపై అవగాహనను పెంచాలి. ఆశతో నిండిన అన్ని కథలను చెప్పాలి. ప్రతి ఒక్కరి ఆరోగ్యం శ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తాను” అని ఆమె రాశారు.

2012లో అండాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్న మనీషా కొయిరాలా కొన్నేళ్ల క్రితం ఆ వ్యాధి నుంచి కోలుకుంది. జనవరి 8, 2018న ముంబైలో ఆమె తన ఆత్మకథ – హీల్డ్: హౌ క్యాన్సర్ గేవ్ మి ఎ న్యూ లైఫ్‌ను ఆవిష్కరించింది. ఆమె తన పుస్తకంలో క్యాన్సర్‌ నుంచి బయటపడిన దాని గురించి తెలిపారు. “జీవితానికి రెండు అవకాశాలు ఇచ్చినందుకు ఎప్పటికీ కృతజ్ఞతలు. ఇది అద్భుతమైన జీవితం, ఆరోగ్యంగా జీవించే అవకాశం మీ చేతిలో ఉందని” చెప్పారు.

Read Also.. Lasya Manjunath: స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్న ‘లాస్య మంజునాథ్’ కొడుకు.. ఫ్యామిలీ ఫొటోస్..