Bollywood Stars: బ్రేకప్ రూమర్స్.. ఒక్క ఫోటోతో అదిరిపోయే రిప్లై ఇచ్చిన స్టార్ హీరో..

|

Jan 12, 2022 | 8:07 PM

Bollywood Stars: బాలీవుడ్‌లో ఎప్పుడు ఎవరు కలిసి ఉంటారో, ఎవరు విడిపోతారో.. ఎవరికి ఎవరు తోడవుతారో చెప్పడం చాలా కష్టంతో కూడుకున్న..

Bollywood Stars: బ్రేకప్ రూమర్స్.. ఒక్క ఫోటోతో అదిరిపోయే రిప్లై ఇచ్చిన స్టార్ హీరో..
Follow us on

Bollywood Stars: బాలీవుడ్‌లో ఎప్పుడు ఎవరు కలిసి ఉంటారో, ఎవరు విడిపోతారో.. ఎవరికి ఎవరు తోడవుతారో చెప్పడం చాలా కష్టంతో కూడుకున్న పని. సీనియర్ నటీనటులు సైతం తమ ఏళ్ల కాపురానికి పుల్‌స్టాప్ పెట్టి విడాకులు తీసుకున్న దాఖలాలు మనం చూశాం. మరికొందరైతే.. వివాహ బంధానికి శుభం పలికి.. తమకంటే చిన్న వయస్సు వారితో చెట్టాపట్టాలేసుకుని హల్ చల్ చేస్తున్నవారూ ఉన్నారు. వారిలో ముఖ్యంగా మలైకా అరోరా, అర్జున్ కపూర్ జంట ప్రముఖంగా చెప్పుకోవచ్చు.

నాలుగు పదుల వయసు పైబడినా.. ఏమాత్రం క్రేజ్ తగ్గని నటి మైలైకా అరోరా. వన్నె తగ్గని అందాలతో అభిమానులను ఉర్రూతలూగిస్తూ బాలీవుడ్‌నే షేక్ చేస్తోంది. అంత క్రేజ్ ఉన్న మలైకా తన భర్తకు విడాకులు ఇచ్చి తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. వీరి వ్యవహారంపై విమర్శలు, కామెంట్స్ కోకొల్లలు వచ్చాయి. అయినా డోంట్ కేర్ అనేశారు ఈ ప్రేమ పక్షలు. ప్రేమకు వయసుతో పనిలేదంటూ ప్రేమ కవితలు వల్లించారు. అయితే, ఈ జంటపై తాజాగా మరో పెద్ద రూమరే వచ్చింది. గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జంట విడిపోయిందంటూ బీ టౌన్‌లో విపరీతమైన చర్చ సాగింది. వీరిపై రూమర్స్ సహజమే అయినా.. ఈసారి కాస్త డోస్ ఎక్కువ అయ్యింది. దాంతో అర్జున్ కపూర్ తనదైన స్టై్ల్‌లో స్పందించాడు. ఒక్క పిక్‌తో రూమర్స్ క్రియేటర్స్‌ నోళ్లు మూయించేశాడు. మలైకాతో కలిసి దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసిన అర్జున్ కపూర్.. చెత్త పుకార్లకు చోటు లేదంటూ తేల్చి చెప్పాడు.

‘‘నీచమైన పుకార్లకు చోటు లేదు. సురక్షితంగా, సంతోషంగా ఉండండి. లవ్ యూ ఆల్.’’ అంటూ క్యాప్షన్ పెట్టిన అర్జున్ కపూర్.. తమ జంటపై రూమర్ క్రియేట్ చేసే వారి చెంప చెళ్లుమనిపించాడు.

Also read:

Visakha – Grama Darshini: మళ్లీ పెళ్లి పీఠలెక్కి మురిసిపోయిన ఐఏఎస్ అధికారి.. మీరు కూడా అంటూ…

Kishan Reddy: ఒమిక్రాన్ వ్యాప్తి.. ఈశాన్య రాష్ట్రాలకు కీలక సూచనలు చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

AP Politics: ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంలో స్మశాన రచ్చ.. తగ్గేదే లే అంటున్న కీలక నేతలు..