
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ భర్త అదిల్ దుర్రానీపై రేప్ కేసు నమోదు అయ్యింది. మైసూరులో దుర్రానీపై ఆ కేసు బుక్కైంది. రాఖీ భర్త తనను మోసం చేశారని ఆరోపణ చేసింది ఇరాన్‌కు చెందిన విద్యార్ధిని. చదువు కోసం ఇరాన్ నుంచి వచ్చిన యువతిని రాఖీ భర్త దుర్రానీ మోసం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. రేప్, చీటింగ్, బ్లాక్‌మెయిలింగ్, బెదిరింపు ఆరోపణల కింద కేసు బుక్ చేశారు మైసూరులోని వీవీ పూరం పోలీసులు. ఫార్మసీ చదవేందుకు ఇరాన్ నుంచి ఓ అమ్మాయి మైసూరుకు వచ్చింది. అయిదేళ్ల నుంచి ఆమె ఇక్కడే చదువుకుంటుంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ యువతిని ట్రాప్ చేసి రేప్ చేసినట్లు దుర్రానీపై పోలీసులకు కంప్లూంట్ చేసింది యువతి. పెళ్లి చేసుకుంటాడన్న ఉద్దేశంతో దుర్రానీపై శరీరకంగా దగ్గరైనట్లు ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే అయిదేళ్ల నుంచి పెళ్లి చేసుకునేందుకు అనిల్ నిరాకరించినట్లు కంప్లైంట్ లో చెప్పింది.
అదిల్ దుర్రానీపై భార్య రాఖీ సావంత్ కూడా కేసు బుక్ చేయడంతో అతన్ని అరెస్టు చేశారు పోలీసులు. తన ఫండ్స్‌ను దుర్వినియోగం చేసినట్లు అదిల్‌పై రాఖీ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతేడాది ఆదిల్ దురానీతో వివాహం చేసుకుంది రాఖీ సావంత్. ఆ తర్వాత ఆమె జీవితం ఊహించని మలుపులు తిరిగింది. ఆమె భర్తకు మరొకరితో సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. అతనిపై ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దుర్రానీపై రెండు లైంగిక కేసులు నమోదయ్యాయి.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..