Ankita Lokhande : స్టార్ హీరో నన్నురూమ్ లోకి రమ్మన్నాడు.. సంచలన విషయాలు తెలిపిన సుశాంత్ మాజీ ప్రియురాలు..

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ మరణం సినిమా ఇండస్ట్రీని కుదిపేసిన విషయం తెలిసిందే.. సుశాంత్ మరణం తర్వాత పోలీసుల ఎంక్వేరిలో డ్రగ్స్ కోణం బయటపడటంతో సినిమా రంగం ఉలిక్కిపడింది.

Ankita Lokhande : స్టార్ హీరో నన్నురూమ్ లోకి రమ్మన్నాడు.. సంచలన విషయాలు తెలిపిన సుశాంత్ మాజీ ప్రియురాలు..
Ankita Lokhande

Updated on: Mar 25, 2021 | 7:30 AM

Ankita Lokhande : బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ మరణం సినిమా ఇండస్ట్రీని కుదిపేసిన విషయం తెలిసిందే.. సుశాంత్ మరణం తర్వాత పోలీసుల ఎంక్వేరిలో డ్రగ్స్ కోణం బయటపడటంతో సినిమా రంగం  ఒక్కారిగా ఉలిక్కిపడింది. ఇదిలా ఉంటే సుశాంత్ మాజీ ప్రియురాలు అంకిత లోఖండే ఓ స్టార్ హీరో పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వివాదం రగులుతున్న నేపథ్యంలో అంకిత ఓ హీరో తనను రూమ్ లోకి రమ్మన్నాడని తెలిపి మరో బాంబ్ పేల్చింది.

ఇక సినిమా ఇండస్ట్రీ తమకు ఎదురైనా చేదు అనుభవాలను హీరోయిన్లు ఒక్కొక్కరుగా సందర్భాన్ని బట్టి బాయట పెడుతున్నారు. ఈ క్రమంలో అంకిత కూడా తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని మీడియాతో పంచుకుంది. సౌత్ ఇండస్ట్రీ నుంచి తనకు ఓ సినిమా అవకాశం వచ్చిందని.. అయితే ఆ సమయంలో ఓ స్టార్ హీరో తనను రూమ్ కి రమ్మన్నాడని తెలిపింది. కాంప్రమైజ్ అవుతావా అని అడిగాడని చెప్పింది. అయితే అతడి నుంచి తప్పుకోవడానికి తాను పార్టీలకు డిన్నర్లకు ఏమైనా రావాలా? అని ప్రశ్నించానని తెలిపింది. దానికి ఆ హీరో మౌనంగా ఉండిపోయాడని అంది. అప్పటికే నాకు ఆసినిమా ఛాన్స్ రాదని అర్థమైందని అంది అంకిత.. తాను అనుకున్నట్టే ఆ సినిమా ఛాన్స్ రాలేదని తెలిపింది. అయితే ఆస్టార్ హీరో ఎవ్వరు అనే విషయాన్నీ మాత్రం అంకిత బయట పెట్టలేదు. ఇదిలా ఉంటే ఇటీవలే తాను సుశాంత్ తో ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అనే విషయాన్నీ బయట పెట్టింది అంకిత. సుశాంత్ తనకన్నా కెరియర్ ను ఎక్కువ ప్రేమించాడని..తన కోసం చాలా సినిమాల్లో అవకాశాలను వదులుకున్నా అని తెలిపింది అంకిత.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Adipurush update: ‘ఆదిపురుష్’ నుంచి క్రేజీ అప్‏డేట్ రానుందా ? ఆరోజున ప్రభాస్ లుక్ వచ్చే ఛాన్స్..

Sonu Sood: బిడ్డకు సోనూసూద్ పేరు పెట్టుకున్న ఖమ్మం దంపతులు.. నేరుగా కలిసిన రియల్ హీరో… ( వీడియో )

ట్రాన్స్‏జెండర్ కూతురిని పరిచయం చేసిన షకీలా.. నెట్టింట్లో వైరల్‏గా మారిన ఫోటోలు..