Rashmika Mandanna: బీటౌన్‏లో స్పీడ్ పెంచిన రష్మిక.. ఆ స్టార్ యంగ్ హీరో సరసన శ్రీవల్లి..

|

Aug 23, 2022 | 6:44 AM

మరోవైపు సిద్ధార్థ్ మల్హోత్రా సరసన మిషన్ మజ్ఞూ, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కాంబోలో రాబోతున్న యానిమల్ సినిమాల్లోనూ

Rashmika Mandanna: బీటౌన్‏లో స్పీడ్ పెంచిన రష్మిక.. ఆ స్టార్ యంగ్ హీరో సరసన శ్రీవల్లి..
Rashmika Mandanna
Follow us on

పుష్ప సినిమా విజయంతో పాన్ ఇండియా లెవల్లో కన్నడ బ్యూటీ రష్మిక (Rashmika Mandanna) క్రేజ్ మారిపోయింది. ప్రస్తుతం ఆమె వరుస ఆవకాశాలతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు దక్షిణాది చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది. హిందీలో వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తెగ బిజీ అయిపోయింది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్‏తో కలిసి గుడ్ బై చిత్రంలో నటిస్తోంది. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అలాగే మరోవైపు సిద్ధార్థ్ మల్హోత్రా సరసన మిషన్ మజ్ఞూ, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కాంబోలో రాబోతున్న యానిమల్ సినిమాల్లోనూ నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీస్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇప్పటికే వరుస ప్రాజెక్టులతో ఫుల్ జోరు మీదున్న శ్రీవల్లి తాజాగా మరో క్రేజీ ఆఫర్ కొట్టేసినట్లుగా బీటౌన్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

బీటౌన్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన రష్మిక నటించనున్నట్లు సమాచారం. ఇటీవలే భూల్ భులయ్యా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కార్తీక్ ప్రస్తుతం దూకుడు మీదున్నాడు. వచ్చిన ప్రతి ప్రాజెక్ట్ పట్టాలెక్కించేపనిలో ఉన్నాడు ఈ యంగ్ హీరో. తాజాగా ఓ కొత్త ప్రాజెక్టుకు కార్తీక్ సైన్ చేశాడని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో యాక్షన్, రొమాంటిక్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో కార్తీక్ సరసన శ్రీవల్లి నటించనుందని.. అంతేకాకుండా పలు కీలకపాత్రల కోసం దక్షిణాది నటీనటులు కనిపించనున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.మరోవైపు రష్మిక, అల్లు అర్జున్ కాంబోలో రానున్న పుష్ప 2 సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.