KL Rahul- Athiya Shetty: ‘చీకటి తర్వాత వెలుగు’.. కేఎల్‌ రాహుల్‌ సెంచరీపై అతియా ఎమోషనల్‌

వరల్డ్‌ కప్‌ సమీపిస్తున్న నేపథ్యంలో కే ఎల్ రాహుల్‌కు ఈ సెంచరీ ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే వరుసగా గాయాలు, ఫామ్‌లేమితో గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు రాహుల్‌. టీమ్‌లో అతని ప్లేస్‌ కూడా ప్రశ్నార్థకమైంది. రాహుల్‌ను ఎందుకు జట్టులోకి తీసుకుంటున్నారు? అంటూ కొందరు మాజీ క్రికెటర్లు సైతం రాహుల్‌పై విమర్శలు గుప్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో పాక్‌తో బరిలోకి దిగిన రాహుల్ సెంచరీతో అదరగొట్టాడు. విరాట్ కోహ్లీతో కలిసి రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు.

KL Rahul- Athiya Shetty: చీకటి తర్వాత వెలుగు.. కేఎల్‌ రాహుల్‌ సెంచరీపై అతియా ఎమోషనల్‌
Athiya Shetty, K L Rahul

Updated on: Sep 12, 2023 | 11:31 AM

ఆసియా కప్‌ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్‌తో జరిగన మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కేఎల్ రాహుల్ కదం తొక్కాడు. సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. వరల్డ్‌ కప్‌ సమీపిస్తున్న నేపథ్యంలో కే ఎల్ రాహుల్‌కు ఈ సెంచరీ ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే వరుసగా గాయాలు, ఫామ్‌లేమితో గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు రాహుల్‌. టీమ్‌లో అతని ప్లేస్‌ కూడా ప్రశ్నార్థకమైంది. రాహుల్‌ను ఎందుకు జట్టులోకి తీసుకుంటున్నారు? అంటూ కొందరు మాజీ క్రికెటర్లు సైతం రాహుల్‌పై విమర్శలు గుప్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో పాక్‌తో బరిలోకి దిగిన రాహుల్ సెంచరీతో అదరగొట్టాడు. విరాట్ కోహ్లీతో కలిసి రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ పెర్ఫామెన్స్‌తో వరల్డ్‌కప్‌లో చోటు ఫైనల్‌ ఎలెవన్‌లో చోటు కూడా ఖాయం చేసుకున్నాడు. ఈ క్రమంలో రాహుల్‌ ఆటతీరుపై అతని సతీమణి నటి అతియాశెట్టి ఎమోషనల్ అయ్యింది. రాహుల్ చేసిన 106 బంతుల్లో 111 రన్స్‌ స్కోరు కార్డును ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన అతియా ఒక భావోద్వేగమైన నోట్‌ రాసుకొచ్చింది. ‘ఎప్పుడో ఒకప్పుడు చీకటి రాత్రులకు తప్పకుండా ముగింపు ఉంటుంది. అలాగే సూర్యోదయం కూడా తప్పక ఉంటుంది. నీవే నాకు సర్వస్వం. ఐ లవ్ యూ’ అంటూ తన భర్తపై ప్రేమను కురిపించింది అతియా.

ఈ పోస్టులోనే రాహుల్ సెంచరీ కొట్టిన బంతి వీడియోను షేర్‌ చేసింది. అలాగే సెంచరీ తర్వాత ఆకాశంలోకి చూస్తూ రాహుల్‌ దేవుడికి మొక్కుతున్న ఫొటోలను కూడా పంచుకుంది. దీంతో ప్రస్తుతం అతియా పోస్టు సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. పలువురు సినీ, క్రికెట్‌ సెలబ్రిటీలు దీనిపై స్పందిస్తున్నారు. సీనియర్‌ హీరో అనిల్ కపూర్, హీరోయిన్‌ వాణి కపూర్, యంగ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ క్లాప్‌, లవ్‌, హార్ట్‌ ఎమోజీలతో రాహుల్‌ను అభినందించారు. ఇక డ్రీమ్ గర్ల్ 2 హీరో ఆయుష్మాన్ ఖురానా ‘వాట్‌ ఏ కమ్‌బ్యాక్‌’ అని అతియా పోస్టుకు కామెంట్‌ పెట్టాడు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కూతురిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింద అతియాశెట్టి. హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె ముబారకన్‌, నవాబ్‌ జాదే, మోతీచూర్‌ చక్నాచూర్ తదితర సినిమాలతో హిందీ ఆడియెన్స్‌కు బాగా చేరువైంది. ఇదే క్రమంలో క్రికెటర్‌ రాహుల్‌తో ప్రేమలో పడింది. ఇరు పెద్దలు వీరి ప్రేమకు అంగీకారం తెలపడంతో ఈ ఏడాది జనవరి 23న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లికి ముందు నుంచే సినిమాలకు దూరంగా ఉన్న అతియా మళ్లీ నటించేందుకు రెడీ అవుతోంది. ఫుట్‌బాల్ క్రీడాకారుడు అఫ్షాన్ ఆషిక్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ‘హోప్ సోలో’లో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది.

ఇవి కూడా చదవండి

 అతియా శెట్టి ఎమోషనల్ పోస్ట్ 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..