Divi vaidya: బిగ్‏బాస్ కంటెస్టెంట్ దివికి సూపర్ ఆఫర్.. పవన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన సొట్ట బుగ్గల సుందరి ?

|

Jan 05, 2021 | 8:15 PM

బిగ్‏బాస్ సీజన్ 4లో ఇంట్లోకి సైలెంట్‏గా అడుగుపెట్టి.. తర్వాత తన అందం.. తన మాట తీరుతో ప్రేక్షుకులకు దగ్గరైపోయింది దివి వైద్య. బిగ్‏బాస్ నుంచి తొందరగానే ఎలిమినేట్ అయ్యింది.

Divi vaidya: బిగ్‏బాస్ కంటెస్టెంట్ దివికి సూపర్ ఆఫర్.. పవన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన సొట్ట బుగ్గల సుందరి ?
Follow us on

బిగ్‏బాస్ సీజన్ 4లో ఇంట్లోకి సైలెంట్‏గా అడుగుపెట్టి.. తర్వాత తన అందం.. తన మాట తీరుతో ప్రేక్షుకులకు దగ్గరైపోయింది దివి వైద్య.  బిగ్‏బాస్ నుంచి తొందరగానే ఎలిమినేట్ అయ్యింది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా మరో క్రేజి ఆఫర్ వరించినట్లుగా తెలుస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తోన్న మల్టీస్టారర్ సినిమాలో ఈ సొట్ట బుగ్గల సుందరి ఛాన్స్ కొట్టేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. మలయాళ ఇండస్ట్రిలో సూపర్ హిట్ సాధించిన చిత్రం అయ్యప్పనమ్ కోషియం రీమేక్‏గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాగా కె.చంద్ర ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. రానా, పవన్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై అభిమానుల అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇందులో ఓ కీలక పాత్ర కోసం దివిని ఓకే చేసినట్లుగా ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్‏బాస్ ఫినాలే రోజున తన సినిమాలో నటించేందుకు దివికి ఆఫర్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. మెహర్ రమేష్ దర్శకత్వంలో రాబోతున్న తన సినిమాలో దివికి పోలీస్ ఆఫీసర్ పాత్ర ఇవ్వనున్నట్లుగా చిరు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read:

డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టిన బిగ్‌బాస్ ఫేమ్ దివి.. బ్లాక్ శారీలో నెటిజెన్లను ఫిదా చేసిన అందాల భామ.