Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ హౌజ్‌లో దమ్‌ మారో దమ్‌.. సిగిరెట్‌ తాగుతూ ముద్దుగుమ్మల రచ్చరచ్చ.!

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ రియాలిటీ సీజన్‌ 5 ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారుతోంది. హౌజ్‌మేట్స్‌ మధ్య గొడవలు, అలకలు, ప్రేమలు ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌కు సమయం ఆసన్నమవుతోంది...

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ హౌజ్‌లో దమ్‌ మారో దమ్‌.. సిగిరెట్‌ తాగుతూ ముద్దుగుమ్మల రచ్చరచ్చ.!
Bigboss 5

Updated on: Sep 07, 2021 | 8:50 PM

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ రియాలిటీ సీజన్‌ 5 ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారుతోంది. హౌజ్‌మేట్స్‌ మధ్య గొడవలు, అలకలు, ప్రేమలు ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌కు సమయం ఆసన్నమవుతోంది. ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌ షో కాంట్రవర్సీలకు కూడా కేరాఫ్‌గా మారుతుందని తెలిసిందే. హౌజ్‌లో కంటెస్టెంట్‌లు చేసే వ్యాఖ్యలు, పనులు పలు సందర్భాల్లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా హౌజ్‌లో ఉన్న ఇద్దరు ముద్దుగుమ్మలు చేసిన పనికి సోషల్‌ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

సహజంగానే బిగ్‌బాస్‌ హౌజ్‌లో నిర్వాహకులు స్మోక్‌ చేయడానికి ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేస్తారు. ప్రతీ సీజన్‌లో కొందరు స్మోక్‌ చేసే వాళ్లు ఈ గదిలోకి వెళ్లి సిగరెట్‌ కొడుతూ.. సీక్రెట్‌గా మాట్లాడుకుంటారు. అయితే ఇప్పటి వరకు జరిగిన సీజన్‌లలో ఒక్క ముమైత్‌ ఖాన్‌ మాత్రమే దమ్ము కొడుతూ కనిపించింది.. కానీ ఈసారి మాత్రం ఏకంగా ఇద్దరు ముద్దుగుమ్మలు గుప్పు గుప్పుమంటూ పొగలు వదిలారు. మొదటి ఎపిసోడ్‌లోని అన్‌సీన్‌ కార్యక్రమంలో హమీదా, సరయూ లోబోతో కలిసి దమ్ము కొట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుకుంటూ.. ఇంటి సభ్యుల్లో కొందరు కనెక్ట్‌ కావడం కష్టమని, బయటే కనెక్ట్‌ అవుతామంటూ సంభాషించారు. అనంతరం సిగరెట్లను భద్రంగా కవర్లలో దాచుకున్నారు. సిగరెట్లు ప్రతిరోజు వస్తాయో లేదో అని హమీదా అనుమానం వ్యక్తం చేయగా ప్రతిరోజు వస్తాయని బదులిచ్చాడు లోబో. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతుండగా.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Also Read: Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు, నలుగురి బ్యాంక్ ఖాతాల నుండి విదేశాలకు భారీగా డబ్బు..!

Priyanka Mohan: చూపులతో ఫాన్స్ కట్టి పడేస్తున్న అరుల్ మోహన్ పిక్స్..

Radhika Apte Birthday: కుర్రకారులో సెగలు రేపుతున్న రాధికా ఆప్టే బర్త్‌డే స్పెషల్ ఫోటో గ్యాలెరీ