శాంటాక్లాజ్ గెట‌ప్‌‌‌లో బిగ్ బాస్ 4 విన్నర్.. రోడ్డు ప‌క్క‌న ఉన్న వారికి క్రిస్మ‌స్ గిఫ్టులు అందించిన అభిజీత్

|

Dec 25, 2020 | 9:10 PM

బిగ్  బాస్ సీజన్ 4 విన్నర్  అభిజీత్ ఎంతలా ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడో ప్రత్యేకానఁగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లాది మంది అభిమానులు,

శాంటాక్లాజ్ గెట‌ప్‌‌‌లో  బిగ్ బాస్ 4 విన్నర్.. రోడ్డు ప‌క్క‌న ఉన్న వారికి క్రిస్మ‌స్ గిఫ్టులు అందించిన అభిజీత్
Follow us on

బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్  అభిజీత్ ఎంతలా ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లాది మంది అభిమానులు, ప్రేక్షకులు అతడికి సపోర్ట్ చేసి బిగ్ బాస్ విన్నర్ ను చేసారు. అభిజిత్ క్రిస్మ‌స్ సంద‌ర్భంగా న‌గ‌రంలో సంద‌డి చేశాడు. రోడ్డు ప్రక్కన ఉన్నవారిని ఆప్యాయంగా పలకరించి వారితో మాట్లాడాడు. శాంటాక్లాజ్ గెట‌ప్ వేసుకున్న అభిజీత్  రోడ్డు ప‌క్క‌నే ఉన్న వారికి క్రిస్మ‌స్ గిఫ్టుల‌ను అందించాడు. కేబీఆర్ పార్కు నుంచి మొదలు పెట్టి నగరంలోని ప‌లు అనాథాశ్ర‌మాల‌కు వెళ్లి వారికి కానుక‌లందించాడు అభిజీత్. అభిజీత్ మంచి మనసు తెలుసుకొని పలువురు అతడిని అభినందిస్తున్నారు.