మెగా ఎఫెక్ట్.. వరుస ఆఫర్లు.. ఇప్పటికే చేతిలో మూడు సినిమాలు.. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరంటే ?

|

Feb 03, 2021 | 8:38 PM

తెలుగు పాపులర్ షో అయిన బిగ్‏బాస్ ద్వారా ఎంతో మంది చిన్న నటులు స్టార్ డమ్ సంపాదించుకుంటున్నారు. ఇప్పటికే ఈ షో నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది.

మెగా ఎఫెక్ట్.. వరుస ఆఫర్లు.. ఇప్పటికే చేతిలో మూడు సినిమాలు.. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరంటే ?
Follow us on

Bigg Boss Divi vaidya: తెలుగు పాపులర్ షో అయిన బిగ్‏బాస్ ద్వారా ఎంతో మంది చిన్న నటులు స్టార్ డమ్ సంపాదించుకుంటున్నారు. ఇప్పటికే ఈ షో నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరికీ మేలు జరిగిందనే చెప్పుకోవాలి. ఇటీవల పూర్తైన బిగ్‏బాస్ సీజన్ 4లో పాల్గొన్న కంటెస్టెంట్లలో దివి వైద్య ఒకరు. మొదట్లో సైలెంట్ గర్ల్‏గా కనిపించినా.. ఆ తర్వాత తన మాటా, ఆటతీరుతో మంచి గుర్తింపు పొందింది. అయితే హౌస్ నుంచి తొందరగానే బయటకు వచ్చేసింది ఈ బ్యూటీ. ఇక ఈ షో ఫైనాల్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ అమ్మడుకు తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని కూడా చెప్పాడు.

ఇక పలువురు దర్శకనిర్మాతల నుంచి వరుస ఆఫర్లను అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది దివి. ఇవే కాకుండా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా చిత్రీకరణలో పాల్గొంటుంది. అలాగే కాన్సెప్ట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ గురువారం ప్రారంభంకానుంది. ఇవే కాకుండా త్వరలోనే రొమాంటిక్ ఎంటర్ టైనర్ లాంబసింగి మూవీ టీంలో చేరనుంది. ఈ సినిమాలతోపాటు మరిన్ని ప్రాజెక్టులలో కూడా దివి నటించనున్నట్లుగా సమాచారం.