బిగ్‌బాస్‌-3 షోని రద్దు చేయాలి.. లేదంటే నాగార్జున ఇంటిని..!

| Edited By: Pardhasaradhi Peri

Jul 18, 2019 | 12:59 PM

బిగ్‌బాస్-3 షో వివాదాల సుడిగుండంలో నలుగుతోంది. ఈ షో ప్రోమోలు మొదలయినప్పటి నుంచే వివాదాలు దీన్ని చుట్టుముట్టాయి. మొదట యాంకర్ శ్వేతారెడ్డి, ఆ తరువాత నటి గాయత్రీ గుప్తా బిగ్‌బాస్ నిర్వాహకులపై ఫిర్యాదు చేసిన విషయం విదితమే. తమ పట్ల వారు అనుచితంగా ప్రవర్తించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేయగా.. దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌ రెడ్డి కూడా తెలంగాణ హైకోర్టులో ఈ షోను నిలిపివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా.. […]

బిగ్‌బాస్‌-3 షోని రద్దు చేయాలి.. లేదంటే నాగార్జున ఇంటిని..!
Follow us on

బిగ్‌బాస్-3 షో వివాదాల సుడిగుండంలో నలుగుతోంది. ఈ షో ప్రోమోలు మొదలయినప్పటి నుంచే వివాదాలు దీన్ని చుట్టుముట్టాయి. మొదట యాంకర్ శ్వేతారెడ్డి, ఆ తరువాత నటి గాయత్రీ గుప్తా బిగ్‌బాస్ నిర్వాహకులపై ఫిర్యాదు చేసిన విషయం విదితమే. తమ పట్ల వారు అనుచితంగా ప్రవర్తించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేయగా.. దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌ రెడ్డి కూడా తెలంగాణ హైకోర్టులో ఈ షోను నిలిపివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.

తాజాగా.. ఇప్పుడు ఓయూ విద్యార్థి సంఘాలు కూడా బిగ్ బాస్ షోపై గళమెత్తాయి. మహిళల పట్ల కాస్టింగ్ కౌచ్‌ను వ్యతిరేకిస్తూ.. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ షోను రద్దు చేయాలని ఈ సంఘాలు రోడ్డెక్కాయి. షోను రద్దు చేయని పక్షంలో సీనియర్ హీరో నాగార్జున ఇంటిని, నిర్వాహకుల ఇళ్ళను ముట్టడిస్తామని ఓయూ విద్యార్థి సంఘాలు నేతలు హెచ్చరించారు.