Bigg Boss 10 Telugu : బిగ్బాస్ 10లోకి సీరియల్ హీరోయిన్.. రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేసిన గ్లామర్ బ్యూటీ ?!!..
బుల్లితెరపై మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ 10వ సీజన్ సందడి స్టార్ట్ కాబోతుంది. దీంతో అటు సోషల్ మీడియాలో సెలబ్రెటీల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు స్మాల్ స్క్రీన్ పై సామాన్యుల కోసం అగ్ని పరీక్ష షో రన్ అవుతుంది. ఇక ఇప్పుడు నెట్టింట ఓ సీరియల్ బ్యూటీ పేరు మారుమోగుతుంది. ఒకప్పుడు ఆమె తెలుగు అడియన్స్ కలల దేవత..

బిగ్ బాస్ సీజన్ 10 వచ్చేస్తుంది. మరికొన్ని రోజుల్లో ఈ రియాల్టీ షో బుల్లితెరపై సందడి చేయబోతుంది. ఓవైపు సామాన్యుల కోసం అగ్ని పరీక్ష షో రన్ అవుతుంది. అలాగే సోషల్ మీడియాలో సెలబ్రెటీలు, సీరియల్ హీరోహీరోయిన్లు, జబర్దస్త్ కమెడియన్స్ పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే యంగ్ హీరోహీరోయిన్స్, ఫోక్ డ్యాన్సర్స్ మాధురి రాథోడ్, ఈశ్వర సాయి, జబర్దస్త్ పవిత్ర, వర్ష, ముఖేష్ గౌడ పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే ప్రముఖ టీవీ సీరియల్ హీరోయిన్ సుహాసిని పేరు సైతం వినిపించింది. అంతేకాదు గుండె నిండ గుడి గంటలు సీరియల్ ఫేమ్ బాలు పేరు వినిపించగా.. తాను వెళ్లడం లేదని వీడియోతో క్లారిటీ ఇచ్చాడు బాలు. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ పేరు వినిపిస్తుంది. ఆమె మరెవరో కాదు.. డెబ్జానీ మోదక్. ఈ పేరు గుర్తుందా.. ? తనే ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఇందులో తన నటనతోపాటు అందంతోనూ ప్రేక్షకులను కట్టిపడేసింది. తెలుగు రాకపోయినప్పటికీ తనదైన నటనతో అడియన్స్ హృదయాలు గెలుచుకుంది ఈ బెంగాలీ ముద్దుగుమ్మ.
ఎక్కువమంది చదివినవి : Comedian Sudhakar: ఒక్క సినిమాకు రూ.30 వేల రెమ్యునరేషన్.. ఆస్తులపై క్లారిటీ ఇచ్చిన నటుడు సుధాకర్..
అయితే ఆమెకు బిగ్ బాస్ కోసం వారానికి రూ.4 లక్షల రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తుంది. తెలుగులో ఎన్నెన్నో జన్మల బంధం, సత్యభామ వంటి సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఫ్యామిలీ అడియన్స్ మాత్రమే కాకుండా యూత్ సైతం ఫ్యాన్స్ అయ్యారు. ఇక ఇటీవలే స్మాల్ స్క్రీన్ పై వచ్చే ఎంటర్టైన్మెంట్ షోలలో తన కామెడీ, ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు బిగ్ బాస్ 10లో డెబ్జానీ ఎంట్రీ ఇస్తుండడంతో ఎంటర్టైన్మెంట్ అదిరిపోతుందని.. ముఖ్యంగా యూత్ అట్రాక్షన్ ఎక్కువగానే ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఎక్కువమంది చదివినవి : Eshwar Sai : ఆ టైంలోనే మాధురి నాకు కనెక్ట్ అయ్యింది.. ఆమె చాలా మంచిది.. నోరు విప్పిన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర సాయి..
ఇక బిగ్ బాస్ 10లోకి సీరియల్ బ్యూటీ పల్లవి గౌడతోపాటు గుప్పెడంత మనసు ఫేమ్ రక్షిత సైతం ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్. అలాగే జబర్దస్త్ ఫేమ్ నూకరాజు పేరు సైతం నెట్టింట వైరలవుతుంది. అయితే మరికొన్ని రోజుల్లో ఎవరెవరు హౌస్ లోకి అడుగుపెట్టనున్నారో క్లారిటీ రానుంది.
ఎక్కువమంది చదివినవి : Chalaki Chanti: వాడు నా పొట్ట కొట్టాడు.. నాకు అవకాశాలు రాకుండా చేశాడు.. చలాకీ చంటి..
డెబ్జానీ మోదక్ పోస్ట్..
View this post on Instagram
ఎక్కువమంది చదివినవి : Aamani: నాకు లైఫ్ ఇచ్చింది ఆయనే.. ఆ హీరోతోనే ఎక్కువ సినిమాలు చేశా.. హీరోయిన్ ఆమని..
