Bigg Boss: బిగ్‏బాస్ విన్నర్‏తో రోడ్డుపై గొడవ.. చాకచక్యంగా డీల్ చేసిన నటుడు.. వీడియో వైరల్..

|

Dec 15, 2020 | 6:22 PM

హిందీ బిగ్‏బాస్ 13 సీజన్ విన్నర్ సిద్ధార్థ్ శుక్లాకి తెగ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సిద్దార్థ్‏కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‏గా మారింది.

Bigg Boss: బిగ్‏బాస్ విన్నర్‏తో రోడ్డుపై గొడవ.. చాకచక్యంగా డీల్ చేసిన నటుడు.. వీడియో వైరల్..
Follow us on

హిందీలో ప్రసారమైన బిగ్‏బాస్ 13 సీజన్ విన్నర్ సిద్ధార్థ్ శుక్లాకి తెగ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సిద్దార్థ్‏కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‏గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. సిద్దార్థ్ డ్రైవ్ చేస్తున్న కారు చుట్టూ దాదాపు 13, 14 మంది చుట్టుముట్టి గొడవకు దిగారు. సిద్ధార్థ్ తాగి డ్రైవ్ చేస్తున్నాడంటూ అతనితో వాగ్వాదానికి దిగారు. అంతమంది చుట్టుముట్టి తనతో గొడవకు దిగినా.. సిద్ధార్థ్ మాత్రం భయపడకుండా వారితో చాకచక్యంగా ప్రవర్తించి తనను తాను కాపాడుకున్నారు. అంతమందిలో ఒక్కడిగా ఉన్నాగానీ సిద్ధార్థ్ వాళ్ళతో ఎంతో ధైర్యంగా మాట్లాడడంతో అతని ఫ్యాన్స్ సిద్ధార్థ్‏ను షేర్ (సింహం) అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఓ యూజర్ ఈ వీడియోని షేర్ చేస్తూ.. వాళ్ళు తాగి డ్రైవ్ చేస్తున్నావంటూ సిద్ధార్థ్‎తో గొడవకు దిగారు. మొత్తం 13,14 మంది ఉన్నారు. వారితో గొడవపడడానికి చాలా ధైర్యం కావాలి. తనో సింహం. ముందు షేర్ చేసిన 20 సెకన్ల పాటు ఉన్న వీడియోలో తను తాగి డ్రైవ్ చేస్తున్నాడంటూ కావాలని సిద్దార్థ్ పేరు చెడగొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఈ వీడియోతే అసలు నిజం బయటకు వచ్చింది. ఇంకోసారి సిద్ధార్థ్ పేరు చెడగొట్టాలని ప్రయత్నించే వారిని వారి కర్మ గమనిస్తూ ఉంటుందని గుర్తుంచుకోవాలని అంటూ ఈ వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.